Gastric Problem Video: ఎవరి కంపు వారికి ఇంపు అంటారు.. కానీ, ఆ కంపును పక్క వాళ్ళు భరించడమే చాలా కష్టం. ముఖ్యంగా భారీ శబ్దాలతో గ్యాస్ వదిలే వారి వల్ల చుట్టుపక్కల వారికి నరకమే కనిపిస్తుంది. బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది. క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోకుండా.. ఇష్టానుసారంగా ఏది పడితే అది పొట్టలోకి తోస్తే.. జీర్ణాశయంలో వెలువడే వాయువులు బయటికి వస్తాయి. అవి అత్యంత దుర్గంధపూరితమైన వాసనతో ఉంటాయి. వదిలే వారికి ఈజీ గానే ఉన్నప్పటికీ.. పీల్చే వాళ్లకే చుక్కలు కనిపిస్తుంటాయి.
సోషల్ మీడియాలో వింతైన వీడియోలకు విపరీతమైన క్రేజీ ఉంటుంది. ఒకప్పుడు క్రియేటర్లు ఒక తరహా వీడియోలను మాత్రమే రూపొందించేవారు. చూసేవాళ్ళు కొత్తదనం కోరుకుంటున్న నేపథ్యంలో క్రియేటర్లు కూడా వింతగా ఆలోచించడం మొదలుపెట్టారు. చివరికి మనుషులు వదిలే గ్యాస్ ని కూడా వదిలిపెట్టకుండా వీడియోలను రూపొందిస్తున్నారు. అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.. ఆ వీడియోలో ఓ మహిళ తన బాధను తోటి స్నేహితురాలితో చెప్పుకుంటూ ఉంటుంది. తన భర్త ఏదో ఒకటి తింటూ ఉంటాడని.. అలా తినడం వల్ల గ్యాస్ వదులుతుంటాడని.. భారీగా శబ్దాలు కూడా చేస్తుంటాడని వాపోతోంది. ఒకసారి తన తల్లి వచ్చినప్పుడు.. తన భర్త భారీ శబ్దాలతో గ్యాస్ వదిలాడని.. ఆ వాసనకు ఆమె తట్టుకోలేక పోయిందని ఆ మహిళ తన స్నేహితురాలితో వాపోయింది. సరిగ్గా ఈ సన్నివేశాలనే క్రియేటర్లు వింతైన వీడియో గా రూపొందించారు.
ఈ వీడియోను ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం Instagram లో పోస్ట్ చేశారు. అది కాస్త లక్షలలో వ్యూస్ సొంతం చేసుకుంది. వాస్తవానికి ఇలాంటి వీడియోకు ఏం వ్యూస్ ఉంటాయని క్రియేటర్లు ఆలోచించలేదు. రూపొందించారు, పోస్ట్ చేశారు. దీంతో Instagram మొత్తం షేక్ అయిపోతోంది. లక్షలలో వ్యూస్ మాత్రమే కాదు, అదే స్థాయిలో కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తద్వారా మనిషి దైనందిన జీవితంలో జరిగే మార్పులను కూడా నెటిజెన్లు ఆస్వాదిస్తారని ఈ వీడియో ద్వారా నిరూపితమైంది.
” నెటిజన్లు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అటువంటప్పుడు ఇటువంటి వీడియోలకు కచ్చితంగా వియర్ షిప్ ఉంటుంది. అందువల్లే ఇటువంటి వీడియోలను కంటెంట్ క్రియేటర్లు పోస్ట్ చేస్తున్నారు. మొదట్లో ఇటువంటి వీడియోలను చూసేందుకు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత చూడగా చూడగా అలవాటైపోయింది. అందువల్లే ఇటువంటి వీడియోలు ఎక్కువ వీక్షణలు సొంతం చేసుకుంటున్నాయని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.