Hyundai Creta Hybrid Car: భారతదేశంలో SUV కార్లను అందించడంలో Hyundai కంపెనీ ప్రత్యేకత సాధించుకుంటుంది. ఇప్పటికే ఎన్నో మోడల్స్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టి ఆకట్టుకున్న ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లను రోడ్లపై తీసుకొస్తుంది. అయితే 2026 కొత్త సంవత్సరం సందర్భంగా హుందాయి కంపెనీ క్రెటా హైబ్రిడ్ కారును తీసుకువస్తుంది. హుందాయి క్రెటా ఇప్పటికే వినియోగదారులకు బెస్ట్ కారుగా నిలిచింది. అయితే ఇందులో లేటెస్ట్ గా ఫీచర్లను మార్చి, ఆధునిక డిజైన్తో పాటు మైలేజ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణం చేసే విధంగా ఇన్నర్ క్యాబిన్ ను చెక్ చేశారు. మరి ఈ కారులో ఉండే కొత్త ఫీచర్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
Hyundai Creta కారు గురించి ఇప్పటికే కార్లు వాడేవారికి తెలిసే ఉంటుంది. ఈ కారు ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే ఇప్పుడు దీనిని హైబ్రిడ్ పవర్ తో తీసుకొస్తున్నారు. ఇందులో పెట్రోల్ ఇంజన్ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉండనుంది. రెండు ఇంజన్ ను కలిపి అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. డ్రైవర్లకు స్మూత్ డ్రైవింగ్ ఇవ్వడంతో పాటు లాంగ్ జర్నీ చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రెండు ఇంజన్లు కలిపి లీటర్ ఇంధనానికి 35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. హైబ్రిడ్ కారు వల్ల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుందని అంటున్నారు.
అలాగే ఈ కొత్త కారు డిజైన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీనికి ముందు భాగంలో బోల్డ్ గ్రిల్, ఆకట్టుకునే LED హెడ్ లాంప్స్ ప్రీమియం కార్ల వాలే అనుభూతిని ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్, అల్లాయి వీల్స్ తో కొత్త కారు చూడగానే ఆకట్టుకుంటుంది. వెనుక భాగంలో కూడా ఎల్ఈడి లాంప్స్ ను ఏర్పాటు చేశారు. ఇన్నర్ క్యాబిన్లో విశాలవంతంగా ఉండేందుకు దీనిని మార్చేశారు. ఇందులో డాష్ బోర్డు డిజైన్ స్మూత్ టచ్ ఇస్తుంది. యంబియంట్ లైటింగ్ తో పాటు ప్రయాణికులకు లెగ్ రూమ్ సౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇందులో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే స్మార్ట్ ఫ్యూచర్ లో ఉన్నాయి. అలాగే పెద్ద స్క్రీన్ తో కూడిన ఇన్ఫో టైం మెంట్ సిస్టం అలరిస్తుంది. పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవింగ్ అనుకోతిని కలిగిస్తుంది. వైర్లెస్ చార్జర్ తో పాటు పనోరమిక్ sunroof నేటి తరానికి ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
ఇది హైబ్రిడ్ వాహనం కనుక మూవింగ్ లో ఎలాంటి శబ్దం లేకుండా సైలెంట్ గా ప్రయాణం చేస్తుంది. నగర ప్రయాణికులతో పాటు లాంగ్ జర్నీ చేసే వారికి ఎలా కావాలంటే అలా ప్రయాణం చేసుకునే విధంగా మార్చుకోవచ్చు. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా SUV కారులను కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికి హుందాయి కొత్త కారు స్మార్ట్ ఎంపిక అని అంటున్నారు. అయితే హైబ్రిడ్ ఇంజన్ కనుక దీని ధర రూ .10,79 లక్షలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.