
Gangavva: గంగవ్వ మొదటిసారి ఫ్లయిట్ ఎక్కారు. ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఫ్లైట్ ఎక్కిన ఫోటో షేర్ చేసి తన హ్యాపీ మూమెంట్స్ అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇక ఫ్యాన్స్ ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. విమానం ఎక్కిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని గంగవ్వను అడుగుతున్నారు. ఇంతకీ గంగవ్వ ప్రయాణం ఎక్కడి కంటే.. ఆమె కేరళ వెళ్లారు. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఆమె కేరళ వెళ్లారు. ప్రతి ఏడాది సద్గురు స్వామిజీ కేరళలో మహా శివ ఆదియోగి స్టాట్యూ వచ్చా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం రూపొందిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు పాల్గొంటారు. ఈ ఏడాది గంగవ్వ కూడా ఈ శివరాత్రి జాగార కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలాగే సద్గురుని గంగవ్వ నేరుగా కలిశారు. ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ఇక గంగవ్వ కెరీర్లో ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఏమాత్రం ఆధునిక ప్రపంచం గురించి తెలియని గంగవ్వ యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయ్యారు. ఆమె మాటల్లో, చేతల్లో విలక్షణత గమించిన ఆమె గ్రామానికి చెందిన యువకులు ప్రోత్సహించారు. మై విలేజ్ షో పేరుతో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు.
సోషల్ మీడియా సెలబ్రిటీ హోదాలో గంగవ్వ బిగ్ బాస్ షోకి వెళ్లడం విశేషం. సీజన్ 4లో పాల్గొన్న గంగవ్వ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 60 ఏళ్ల వయసులో గంగవ్వ గొప్ప విశ్వాసం ప్రకటించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా హౌస్లో ఉండి టైటిల్ గెల్చుకుంటా అని చెప్పేవారు. అయితే ఆమె అనారోగ్యం బారినపడ్డారు. పల్లెటూరులో ప్రకృతి మధ్యలో జీవించే గంగవ్వ ఆ నాలుగు గోడల మధ్య ఉండలేకపోయారు. కుటుంబం మీద దిగులుతో అనారోగ్యానికి గురయ్యారు. వైద్యుల సూచన మేరకు ఆమెను హౌస్ నుండి బయటకు పంపారు.

సొంతింటి కల నెరవేర్చుకోవాలని గంగవ్వ బిగ్ బాస్ హౌస్ కి వచ్చినట్లు గంగవ్వ చెప్పారు. ఆమె కోరికను హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్ నిర్వాహకులు తీర్చారు. గంగవ్వ సొంతూరిలో రెండేళ్ల క్రితం కొత్తింటిని నిర్మించుకున్నారు. ఈ ఇంటిని నిర్మాణానికి అయిన డబ్బులు నాగార్జునతో పాటు బిగ్ బాస్ నిర్వాహకులు సమకూర్చారు. గంగవ్వ నటిగా కూడా బిజీ అవుతున్నారు. రాజ రాజ చోర, లవ్ స్టోరీ చిత్రాల్లో గంగవ్వ నటించారు.
View this post on Instagram