https://oktelugu.com/

Gajuwaka Lady Bus Conductor: అట్టాంటిట్టాంటి ఆడది కాదు.. డ్యాన్స్‌తో దుమ్మురేపుతున్న గాజువాక లేడీ కండక్టర్‌!

Gajuwaka Lady Bus Conductor: ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో మంది కొత్త వారిని బుల్లితెరకు పరిచయం చేస్తుంది. టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది. తాజాగా గాజువాక ఆర్టీసీ డిపోకి చెందిన ఓ లేడీ కండక్టర్‌ వచ్చింది. ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో చేసిన డ్యాన్స్‌ ఆ షోకే హైలెట్‌గా నిలిచింది. ఈ వైపు షోలో పాల్గొన్న రాంప్రసాద్‌ లేడీ కండక్టర్‌ డ్యాన్స్‌పై స్పందిస్తూ.. అందరూ ఇక్కడకు రావడాన్ని సంతోషంగా ఫీల్‌ అవుతారని, కండక్టర్‌ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : August 30, 2022 / 06:07 PM IST
    Follow us on

    Gajuwaka Lady Bus Conductor: ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో మంది కొత్త వారిని బుల్లితెరకు పరిచయం చేస్తుంది. టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది. తాజాగా గాజువాక ఆర్టీసీ డిపోకి చెందిన ఓ లేడీ కండక్టర్‌ వచ్చింది. ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో చేసిన డ్యాన్స్‌ ఆ షోకే హైలెట్‌గా నిలిచింది. ఈ వైపు షోలో పాల్గొన్న రాంప్రసాద్‌ లేడీ కండక్టర్‌ డ్యాన్స్‌పై స్పందిస్తూ.. అందరూ ఇక్కడకు రావడాన్ని సంతోషంగా ఫీల్‌ అవుతారని, కండక్టర్‌ షో చూసిన తర్వాత తాము ఆనందంగా ఫీల్‌ అవుతున్నామని ప్రకటించారు. అంటే ఆమో డ్యాన్స్‌ పర్ఫార్మెన్స్‌ ఎంత ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎపిసోడ్‌ చేసిన ప్రేక్షకులంతా ఇప్పుడు ఆమె గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేస్తున్నారు.

    Gajuwaka Lady Bus Conductor

    డ్యాన్సర్‌ ఝాన్సీ..
    శ్రీదేవి డ్రామా కంపెనీలో తన డ్యాన్స్‌ పెర్షార్మెన్స్‌తో అదరగొట్టిన ఆర్టీసీ లేడీ కండక్టర్‌ పేరు ఝాన్సీ. గాజువాక డిపోలో పనిచేస్తున్నారు. తన డ్యాన్స్‌ తర్వాత తన గురించి ఆమె వెల్లడించింది. ‘నన్ను విమర్శించిన వారే నా వెనుకే ఆగిపోయారు. నేను ముందు ఉన్నాను’ అని పేర్కొంది. డ్యాన్సర్, కండక్టర్‌ ఝాన్సీ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. నలుగురికి బాధ్యత నేర్పించాల్సిన పోలీస్‌ కానిస్టేబుల్‌ తన బాధ్యతను మరిచి భార్య, పిల్లలను రోడ్డు వదిలేశాడు. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న తల్లికి అండగా నిలిచింది ఝాన్సీ. ఒక వైపు చదువుకుంటూనే తనకు ఎంతో ఇష్టమైన డ్యాన్స్‌ని కూడా మరోవైపు నేర్చుకుంది. రోడ్డుమీద డ్యాన్స్‌లేంటి.. ఛీ ఛీ ఇదేం బతుకు అని ఛీదరించుకున్న వారే ఇప్పుడు వారెవ్వా ఏమైనా చేసిందా అనే స్థాయికి ఎదిగింది.

    Also Read: Bangaram Girl: జబర్ధస్త్ లోకి వచ్చిన ‘బంగారం యువతి’.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆ బంగారం ఎవరు? ఎక్కడి వారు?

    సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది..
    ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీని షేక్‌ చేసిన గాజువాక లేడీ కండక్టర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్‌లో ‘నేను అట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో.. పల్సర్‌ బైకు ఎక్కి రార బావా’ సాంగ్‌తో స్టేజ్‌ని షేక్‌ షేక్‌ చేసింది ఝాన్సీ. వాస్తవానికి ఆమె మైకు తీసుకుని నేను ఏపీఎస్‌ఆర్‌టీసీ గాజువాక డిపోలో కండక్టర్‌ అని చెప్పే వరక అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. గాజువాక నుంచి హైదరాబాద్‌కి చేరుకున్న ఝాన్సీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసింది

    చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌ ప్రాక్టీస్‌..
    చిన్నప్పటి నుంచే ఝాన్సీకి డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టమట. మొదట్లో ఇంట్లో నుంచి మద్దతు లభించలేదని, కానీ అదే ఇప్పుడు నాకు అన్నం పెడుతుందని ఉద్వేగానికి లోనైంది. ‘నేను స్టేజ్‌ డ్యాన్సర్‌ నుంచి పెద్ద పెద్ద వేదికలపై డ్యాన్స్‌ చేస్తున్నానంటే కారణం మా గురువు రమేశ్‌గారు. నేను గాజువాడ డిపో కండక్టర్‌ గా 11 ఏళ్లుగా పని చేస్తున్నాను. ఇక అప్పటి నుంచి నేను డ్యాన్స్‌ చేస్తూనే ఉన్నాను. కానీ అప్పట్లో సోషల్‌ మీడియా అంత ఫేమస్‌ కాదు. ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా నాకు ఇంత పేరు వచ్చింది. నాలో ఉన్న ఎనర్జీని మరింత పెంచిది. శ్రీదేవి డ్రామా కంపెనీలో డ్యాన్స్‌ చేయడం ద్వారా మంచి పేరు సంపాదించుకున్న’ అని వెల్లడించింది ఝాన్సీ. ప్రస్తుతం ఆమె డ్యాన్స్‌కి ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు. పెద్ద పెద్ద సినిమాల్లో ఆమెకు ఐటెం సాంగ్‌ ఆఫర్‌ ఇచ్చే స్థాయిలో ఆమె డ్యాన్స్‌ ఉందంటూ కొందరూ అభిప్రాయపడుతున్నారు.

    Gajuwaka Lady Bus Conductor

    రూ.2.5 లక్షల రెమ్యునరేషన్‌..
    శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్‌లో ఓ రేంజ్‌లో డ్యాన్స్‌ చేసిన ఈ లేడీ కండక్టర్‌కి ఈటీవీ మల్లెమాల వారు ఇచ్చిన పారితోషికం ఎంత అనేది ప్రస్తుతం చాలా మందిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమె రెండు రోజులపాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం తేదీలు కేటాయించింది. అందుకు మల్లెమాల వారు ఆమెకు రూ.2.5 లక్షలు రెమ్యునరేషన్‌ ఇచ్చారని తెలిసింది. ఆమెకు పారితోషికం తక్కువే అయినప్పటికీ.. ఆమె ఈటీవీలో కనిపించడం ద్వారా అద్భుతమైన ఆఫర్లు ఆమెకు వస్తూనే ఉన్నాయి. ఇలా ఆఫర్లు రావడంతో ఇక ఆమె కండక్టర్‌గా జాబ్‌ మానేసే అవకాశం ఉంది. ఆమె టాలెంట్‌ బయట పడడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక వేదిక అయిందని మాత్రం చెప్పుకోవచ్చు. పారితోషికం విషయం పక్కన పెడితే ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమె కనిపించడమే గొప్ప విషయమంటూ కొందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    Also Read:Salman Khan: తన పెళ్లి పై క్రేజీ యాడ్ చేసిన సల్మాన్‌ ఖాన్‌.. ఇండియా వైడ్ గా వైరల్.. ఇంతకీ కంటెంట్ ఏమిటో తెలుసా ?

    Tags