Funny Moments In Wedding: కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుంటారు. వివాహానికి ఉన్న బంధం అలాంటిది. నూరేళ్లు కలిసి జీవించే జంట అయినందునే పెళ్లి వేడుక ఓ ఉత్సవంలా నిర్వహిస్తారు. బంధుమిత్రుల కలయికతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావంతో వివాహ వేడుక కొత్త పుంతలు తొక్కుతోంది. క్షణాల్లో పెళ్లి తంతు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ లక్షల లైకులు, కోట్ల పోస్టులతో దూసుకుపోతున్నాయి. వేప కాయంత వెర్రి వేయి రకాలుంటుందంటారు. అందులో భాగంగానే పుర్రెకో గుణం జిహ్వకో రుచి అంటారు.

కొందరు ట్రెండ్ సృష్టిస్తారు. మరికొందరు ట్రెండ్ ఫాలో అవుతారు. ఇంకొందరు ట్రెండ్ కే అంబాసిడర్ అవుతారు. నేటియువత ప్రణాళికలే వేరు. వివాహంలో ఫన్నీ ట్విస్టులు, వినోద కార్యక్రమాలు ఉండేలా చూసుకుంటారు. ఇందుకు గాను కొత్త కొత్త వెరైటీలు అవలంభిస్తుంటారు. దీని కోసం అహర్నిశలు ఆలోచిస్తుంటారు. వివాహ వేడుకలో అతిథులకు మరింత ఉత్సాహం తెచ్చుకునేలా కొత్త కార్యక్రమాలు ఆవిష్కరిస్తుంటారు.
Also Read: Jobs: ఎట్టకేలకు నిరుద్యోగుల ‘ఆకలి’ తీర్చనున్న కేసీఆర్
కొన్ని పెళ్లిళ్లలో వధువు వెరైటీగా పెళ్లిపందిరిలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇంకొన్ని మంటపాల్లో పెళ్లి కూతురు గుర్రం మీద వస్తుంది. కొన్ని చోట్ల పెళ్లి కూతురు బుల్లెట్ బండి మీద వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసినా వినోదమే ప్రధానమే కావడం విశేషం. బంధువులను ఆశ్చర్యచకితులను చేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు వేదికలపై ఏదో ఒకటి చేస్తూ అందరి మదిలో స్థానం సంపాదించడమే ధ్యేయం అవుతుంది.

ఇక్కడ మాత్రం పెళ్లి కొడుకు ఓ సరదా తీర్చుకున్నాడు. పె ళ్లి వేడుకలోనే అందరు ఉండగానే పూజారి మంత్రాలు చదువుతుండగానే పెళ్లి కూతురును దగ్గరకు తీసుకుని ఎడాపెడా ముద్దులు పెట్టేశాడు. వధువు ఎంత విదిలించినా అదే పనిగా ముద్దుల వర్షం కురిపించాడు. దీంతో ఆమె సిగ్గుతో తలదించుకుంది. కర్చీఫ్ తో పెదవులు తుడుచుకుంది. ఈ సన్నివేశం కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఆతృత ఆపుకోలేకపోయావా పెళ్లి కొడుకా అని సెటైర్లు వేస్తున్నారు
[…] Woman Committed Suicide: మన తలరాతను మార్చేది చేతిలోని గీతలు కాదు మన చేతలే. జీవితంలో ఎదగాలంటే కష్టపడి పనిచేయాలి. అవాంతరాలను దాటుకుని ముందుకు కదలాలి. అంతే కానీ ఏదో మన అదృష్టం అంటూ పోతే అంతే సంగతి. కొందరు చిన్న విషయాలనే భూతద్దంలో పెట్టి చూసుకుంటారు. జీవితంలో ఏదో జరిగిపోతోందని ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారు జీవితంలో ముందుకు పోలేకపోతూ తమ గతికి విధి వైపరీత్యమే అని నిందిస్తుంటారు. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుని కుమిలిపోతూ జీవితాన్ని మధ్యలోనే వదిలేస్తున్నారు. […]