https://oktelugu.com/

Tollywood disaster filims: తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయిన అగ్రహీరోల సినిమాల గురించి తెలుసా.?

Tollywood disaster filims: సినీ ఇండస్ట్రీలో సినిమాలు విజయం సాధించినవీ.. అట్టర్ ప్లాప్ అయినవీ ఉన్నాయి. అయితే అందులో కొంచెం  కూడా ఆదరించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇటీవల స్టార్ నటుడు బాలకృష్ణ ‘ఆహా’ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో మోహన్ బాబు మీ కెరీర్ లో చూడలేని సినిమా అంటే ఏదైనా ఉందా..? అని అడిగితే ‘వామ్మో అంత రాడ్ రాంబోలానా..?’ అని సెటైర్ వేశాడు. దీంతో రాండ్ రంబోలా ట్యాగ్ తో సోషల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2021 10:07 am
    Follow us on

    Tollywood disaster filims: సినీ ఇండస్ట్రీలో సినిమాలు విజయం సాధించినవీ.. అట్టర్ ప్లాప్ అయినవీ ఉన్నాయి. అయితే అందులో కొంచెం  కూడా ఆదరించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇటీవల స్టార్ నటుడు బాలకృష్ణ ‘ఆహా’ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో మోహన్ బాబు మీ కెరీర్ లో చూడలేని సినిమా అంటే ఏదైనా ఉందా..? అని అడిగితే ‘వామ్మో అంత రాడ్ రాంబోలానా..?’ అని సెటైర్ వేశాడు. దీంతో రాండ్ రంబోలా ట్యాగ్ తో సోషల్ మీడియాలో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. ర్యాండ్ రంబోలా సినిమాలేంటి..? అని కాంటెస్టులు పెడుతున్నారు. అయితే టాలీవుడ్లో వచ్చిన రాండ్ రంబోలా సినిమాలపై తీవ్ర చర్చ సాగుతోంది. అయితే ఆ సినిమాలేవి..? వాటి గురించి ఇప్పుడు చూద్దాం..

    tollywood movies1

    tollywood movies1

    అజ్ాత వాసి: పవన్ కల్యాణ్ -త్రివిక్రమ్ కాంబినేషనల్లో వచ్చిన ఈ సినిమాపై ఫ్యాన్స్, ఆడియన్ష్ హై ఎక్స్ పెక్టెషన్ పెట్టుకున్నారు. ‘అత్తారింటికి దారేది’ బ్లాక్ బస్టర్ సినిమా తరువాత ఈ సినిమా రావడంతో ఫస్ట్ రోజు థియేటర్లు ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయాయి. కానీ సెకండ్ రోజే ఢీలా పడ్డాయి. ఒకానోక దశలో ఈ సినిమా రూ.55 కోట్ల నష్టానికి తీసుకొచ్చింది.

    బ్రహ్మోత్సవం: ‘శ్రీమంతుడు’ సినిమా తరువాత ఫ్యాన్స్ కు కిక్కించేందుకు మహేశ్ మరో ప్రయోగం చేయనున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను తీశాడు. అయితే అనుకున్న రేంజ్ కంటే ఎక్కువ నష్టాన్నే మిగిల్చింది. మొత్తంగా ఈ సినిమా రూ.40 కోట్ల వరకు లాస్ చేసింది.

    తుఫాన్: మెగాపవర్ స్టార్ హీరోగా వచ్చిన ఈ సినిమాతో రామ్ చరణ్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. పాన్ ఇండియా మూవీగా భావించి భారీ బడ్జెట్ పెట్టారు. అప్పటి వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న రామ్ చరణ్ కు ఈ సినిమా భారీ డిజాస్టర్ ను మిగిల్చింది. ఊహించని నష్టాన్ని తీసుకురావడంతో రామ్ చరణ్ ఇక బాలీవుడ్ వైపు చూడలేదు.

    శక్తి: జూనియర్ ఎన్టీఆర్ డబుల్ రోల్ లో నటించిన ఈ సినిమాకు అగ్ర నిర్మాత అశ్వనీదత్ .దీంతో ఈ మూవీపై ఫుల్ ఎక్స్ పెక్టేషన్ పెట్టుకున్నారు. కానీ ఈ నష్టం నుంచి తట్టుకోవడానికి నిర్మాతకు ఏడేళ్లు పట్టిందట. అంతే ఎంత నష్టమైందో అర్థం చేసుకోవచ్చు.

    ఒక్కమగాడు: బాలయ్య, అనుష్క జంటగా వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ వివిధ గెటపుల్లో కనిపించారు. వైవీఎస్ చౌదరి అందించిన ఈ సినిమాపై భారీగా ఎక్స్ పెక్టేషన్స్ ఉండేవి. కానీ డిజాస్టర్ గా మిగల్చింది.

    షాడో: మెహర్ రమేశ్ తెరకెక్కించిన ఈ సినిమా ఏడేళ్ల కిందటే రూ.20 కోట్ల నష్టాన్ని తెచ్చిందంటే సినిమా పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

    మన్మథుడు 2: నాగార్జున కెరర్ లో అత్యంత డిజాస్టర్ గా మిగల్చింది ఈ సినిమా