Dolly Chaiwala Viral : ఎక్కడో పూణే లో ఓ మామూలు ఛాయ్ వాలాగా తనజీవితాన్ని మొదలుపెట్టాడు డాలి. చాయ్ తయారు చేసే విధానంలో వినూత్నతను పాటించడం అతని శైలి. సోషల్ మీడియా వల్ల అతడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.. అంతేకాదు ఆ మధ్య ముఖేష్ అంబానీ కుమారుడి ముందస్తు వివాహ వేడుకకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఇండియాకు వచ్చాడు. ఈ సమయంలో ముకేశ్ అంబానీ ఇంటి కంటే ముందు డాలి ని కలిశాడు. డాలి తో మాట్లాడాడు. అతడు తయారు చేసిన చాయ్ కూడా తాగాడు. అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించాడు. దెబ్బతో డాలి మరింత ఫేమస్ అయ్యాడు. ఇక ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు డాలి దుబాయ్ వెళ్ళాడు. అక్కడ టీమ్ ఇండియా ప్లేయర్లకు చాయ్ తయారుచేసి సర్వ్ చేశాడు. అతడు తయారు చేసిన చాయ్ కి టీమ్ ఇండియా ప్లేయర్లు ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు డాలి మరో కొత్త అవతారం ఎత్తాడు.
Also Read: రూ.2 లక్షలకే వ్యాగన్ఆర్.. వెంటనే త్వరపడండి
డాలీ తయారు చేసిన చాయ్ విపరీతంగా ఫేమస్ కావడంతో.. అతడి పేరు మార్మోగిపోతోంది. సోషల్ మీడియాలో రీల్స్ మొత్తం అతడి చుట్టూ తిరుగుతున్నాయి. ఫలితంగా పూణేలో ఉన్న తన చాయ్ దుకాణం కిటకిటలాడుతోంది. రోజు తక్కువలో తక్కువ ఐదు లక్షల దాకా ఆదాయం వస్తోంది. ఇటీవల కాలంలో అది మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో తనకు వచ్చిన పేరును దృష్టిలో పెట్టుకున్న డాలి మరో అడుగు ముందుకు వేశాడు. ప్రఖ్యాతి పొందిన తన చాయ్ ని దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నాడు.. ఇందులో భాగంగా ఫ్రాంచైజీ కి శ్రీకారం చుట్టాడు. దీనికి సంబంధించి ప్రకటన కూడా చేశాడు.. ఇందులో మొత్తంగా మూడు విభాగాలను అతడు ప్రకటించాడు..కార్ట్ స్టాల్ ను 4.5 నుంచి 6 లక్షలకు.. స్టాండర్డ్ స్టోర్ ను 20 నుంచి 22 లక్షలకు.. ప్లాగ్ షిప్ కేఫ్ ను 39 నుంచి 43 లక్షలకు ఇస్తున్నట్టు ప్రకటించాడు. అయితే దీనికి సంబంధించి టీ పౌడర్.. షుగర్.. ఇతర బ్రాండ్లు మొత్తం కూడా డాలి కంపెనీ అందిస్తుంది.. దీనికోసం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డాలీ మెథడ్ లో మాత్రమే చాయ్ తయారు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చాయ్ ఎలా తయారు చేయాలో డాలి కంపెనీలో పనిచేసే వారు చెబుతారు. స్థలం చెబితే వారే మొత్తం కష్టమైజ్ చేసి ఇస్తారు.. ప్రాంతానికి తగ్గట్టుగా.. చెల్లించిన డబ్బుకు తగ్గట్టుగా చాయ్ తయారు చేసే దుకాణాన్ని మార్చుతారు.
చాయ్ తయారీలో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు డాలి ప్రకటించాడు. ఇప్పటివరకు జింజర్ టీ మాత్రమే అతడు సర్వ్ చేసేవాడు. అయితే తన ఫ్రాంచైజీలో జింజర్ మాత్రమే కాకుండా ఇలాచి, లెమన్, హై బిస్కస్ ఫ్లేవర్లను అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఇవే కాకుండా డయాబెటిక్ రోగులను దృష్టిలో పెట్టుకొని.. సరికొత్త ఫ్లేవర్లను అందుబాటులోకి తీసుకొచ్చాడు. తద్వారా తన చాయ్ మొత్తాన్ని దేశం మొత్తం విస్తరించాలని ప్లాన్లో ఉన్నాడు డాలి. అయితే ఇలా ఫ్రాంచైజీల ద్వారా భారీగా నిధుల సమీకరణ చేపట్టాలని అతడు భావిస్తున్నాడు. ఇలా వచ్చిన నిధులతో ముంబై, పూణే, ఇతర మెట్రోపాలిటీన్ నగరాలలో అతిపెద్ద టీ స్టాల్స్ ఏర్పాటు చేసే దిశగా డాలి ఆలోచిస్తున్నాడు.. మొత్తంగా స్వల్ప కాలంలోనే శ్రీమంతుడిగా ఎదగాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. డాలి చేసిన ప్రకటన నేపథ్యంలో సోషల్ మీడియాలో సంచలనం నెలకొంది. అతని ప్రకటన చూసిన నెటిజన్లు రకరకాలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అతడి వ్యాపారం జోరు చూస్తుంటే త్వరలోనే ముఖేష్ అంబానీ మించిపోతాడని వ్యాఖ్యానిస్తున్నారు.