Homeట్రెండింగ్ న్యూస్Dog Meat : జింక మాసం పేరిట కుక్కను కోసి అమ్మారు.. తిన్నారు.. విషయం తెలిసి...

Dog Meat : జింక మాసం పేరిట కుక్కను కోసి అమ్మారు.. తిన్నారు.. విషయం తెలిసి లబోదిబో..

Dog Meat : గ్రామాల్లో సహజంగానే అడవి జంతువుల మాంసం అనగానే ఎగబడుతుంటారు. అడవి పంది, జింక సహా పలు రకాల జంతువుల మాంసాన్ని ఎంతకైనా పెట్టి కొంటుంటారు. అయితే అది నిజమైన అడవి పంది, జింకనా? అని మాత్రం ఎవరూ చూడరు. అదే మాంసం అనుకొని వండుకొని తినేస్తారు.

దీన్నే కొంతమంది కేటుగాళ్లు వ్యాపారంగా మలుచుకున్నారు. జింక మాంసం అంటూ ప్రజలను బురిడీ కొట్టించి సొమ్ము చేసుకుంటున్నారు.తాజాగా నిర్మల్ జిల్లాలో దారుణమైన నిజం వెలుగుచూసింది.

సాధారణంగా మేక, గొర్రె మాంసాన్ని ఇట్టే గుర్తుపట్టవచ్చు. కానీ ఎప్పుడూ తినని అడవి పంది, జింక మాంసాల రుచిని, పచిని కనిపెట్టలేం. దీన్నే క్యాష్ చేసుకున్న మోసగాళ్లు.. తాజాగా జింక మాంసం అంటూ బురిడీ కొట్టించారు.

తాజాగా నిర్మల్ జిల్లాలోని చందానగర్ లో ఓ పెంపుడు కుక్క దొంగతనం జరిగింది. వీధికుక్క అంటే మరీ జనాలు నమ్మరు అనుకొని ఓ పెంపుడు కుక్కను బాగా బలిష్టంగా ఉన్న దాన్ని దొంగిలించారు. ఆనంద్ అనే వ్యక్తి పెంచుకుంటున్న కుక్కను పొట్టెపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాస్, వరుణ్ దొంగిలించారు. గుట్టు చప్పుడు కాకుండా చంపేశారు. పథకం పేరుతో చుట్టుపక్కల గ్రామాల్లో జింక మాసం అని చెప్పి అమ్మారు. చుట్టూ అడువులు ఉండేసరికి నిజంగానే జింక మాసం అనుకొని చాలా మంది కొనుక్కొని తిన్నారు.

అయితే కుక్క యజమాని తమ కుక్కలేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీసీ కెమెరాను పరిశీలించి ఇద్దరు వ్యక్తులు కుక్కను దొంగిలించినట్టు తేల్చారు. వారిని విచారించగా కుక్కమాంసాన్ని జింక మాసంగా అమ్మినట్టు తెలిపారు. ఇక కుక్కను తిన్న జనాలు మాత్రం కంగారుపడిపోతున్నారు. అందుకే అంటారు ఏది పడితే అది తినొద్దని..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Oktelugu Epaper
Exit mobile version