cheating wife : పెద్దల సమక్షంలో.. అగ్నిసాక్షిగా.. వేదమంత్రాలు పురోహితుడు చదువుతుండగా..తాళి కట్టిన భర్త ఆమె దృష్టిలో ఎందుకూ పనికిరానివాడయ్యాడు. మధ్యలో పరిచయమైన ప్రియుడు గొప్పగా కనిపించాడు. అంతే, ఆమెలో మార్పు.. భర్తను వదిలించుకోవాలనుకుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలను ఆలోచిస్తోంది.
ప్రియుడిని మర్చిపోలేక..అతడి సాంగత్యంలో కొనసాగాలని..ఒక ప్లాన్ వేసింది. భర్తకు ఏవో మాయ మాటలు చెప్పి బయటికి వెళ్ళింది..తను ఉన్న చోటుకు రమ్మని అతడికి కబురు పంపింది. ఆమె చెప్పినట్టుగా అతడు అక్కడికి వచ్చాడు. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు.
ఓ హోటల్ గదిలో రూమ్ అద్దెకి తీసుకున్నారు. ఆ తర్వాత కార్యక్రమం మొదలుపెట్టారు. స్వర్గ సుఖాలలో ఉండగా హఠాత్తుగా ఆమె భర్త ప్రవేశించాడు. భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆమె ప్రియుడిని చితక బాదాడు. తన వెంట పోలీసులను కూడా తీసుకొచ్చాడు. పోలీసులు అక్కడి దృశ్యాలను చూసి షాక్ కు గురయ్యారు..
ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనం కలిగిస్తోంది. అయితే ఈ సంఘటన మనదేశంలో కాకుండా.. వేరే దేశంలో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడి మనుషులను చూస్తుంటే థాయిలాండ్ ప్రాంతానికి చెందిన వారిగా నెటిజన్లు పేర్కొంటున్నారు…
” దేశం ఏదైనా సరే.. మనుషులు ఎలాంటి వారైనా సరే.. అనైతికమైన బంధాల ద్వారా తన్మయత్వం పొందుతున్నారు. కానీ, అలాంటి బంధాలు నిలబడవు. వాటి వల్ల దారుణాలు జరుగుతాయి. ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినప్పటికీ మనుషులలో మార్పు రావడంలేదని” నెటిజన్లు అంటున్నారు.
మన దేశంలో కూడా ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. అనైతికమైన బంధాలలో మునిగి తేలుతున్నవారు తమ జీవిత భాగస్వాములను మోసం చేస్తున్నారు. పనికిమాలిన బంధాల మైకంలో పడి కట్టుకున్న వారిని మోసం చేస్తున్నారు. చివరికి ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఈ తరహా ఘోరాలు మనదేశంలో ఇటీవల ఎక్కువైపోయాయి. న్యాయస్థానాలు శిక్షలు విధిస్తున్నప్పటికీ.. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ చాలామందిలో మార్పు రావడం లేదు. పైగా అంతకుమించి అనే స్థాయిలో దారుణాలు నమోదవుతున్నాయి. మన దేశంలో ఇలా అనుకుంటే.. విదేశాలలో కూడా ఈ దారుణాలు జరుగుతుండడం గమనార్హం.
Cheating is a choice not a mistake pic.twitter.com/j5Q4QrkNrN
— Ꮪᴀᴘɴᴀ (@Kohled_Eyes_) February 16, 2026