Paleti Rama Rao: ‘పుట్టిన వాడికి మరణం తప్పదు.. మరణించిన వాడిని జననం తప్పదు. అనివార్యమగు ఈ విషయములో చింతింప తగదు’ మహాభారత యుద్ధ సమయంలో యుద్ధంతో ప్రాణాలు కోల్పోతున్న సైన్యాయన్ని చూసి బాధపడుతున్న అర్జునిడికి శ్రీకృష్ణుడు చేసిన హితబోధ ఇదీ.. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగానే అనివార్యమగు విషయంలో చింతించడం ఎందుకనుకున్నాడో వ్యక్తి.. మరణ దినం కూడా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. తనకు మరణం ఎప్పుడొస్తుందో ఊహించుకుంటూ.. బతికుండగానే ఆ రోజున ఏటా వేడుక చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు.. ఆహ్వాన పత్రికలూ ముద్రించుకున్నారు. ఇది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుసస్తోంది.

డాక్టర్.. మాజీ మినిస్టర్..
తనకు మరణం ఎప్పుడొస్తుందో ఊహించుకొని.. బతికుండగానే ఆ రోజున ఏటా వేడుక చేసుకోవాలని నిర్ణయించుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి కూడా కాదు. ఆయన డాక్టరు పాలేటి రామారావు. ఆంధ్రప్రపదేశ్‌లోని చీరాలకు చెందిన ఆయన టీడీపీ హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. రామారావు ప్రస్తుత వయసు 63 ఏళ్లు. 75 ఏళ్ల వయసులో అంటే 2034లో చనిపోతానని అంచనా వేసుకున్నారు. ఈ సంవత్సరం నుంచి ‘మరణ దినం’ చేసుకుంటున్నట్లు ఆహ్వాన పత్రిక ముద్రించుకున్నారు.

ఇంకా 12 ఏళ్ల జీవితం..
మరణానికి ఇంకా 12 ఏళ్ల సమయం ఉందని భావించి.. శనివారం చీరాల పట్టణంలో 12వ ‘మరణ దినం’ పేరిట వేడుకలకు సిద్ధమయ్యారు. మనిషి మరణ భయం అధిగమించి, ఇప్పటి వరకు చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు ఇలాంటి వేడుకలు అవసరమని.. అందుకే తొలిసారిగా ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది 11వ వేడుకలు చేస్తానంటున్నారు. ఈ ఆహ్వాన పత్రిక సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.