Pushpa 2 The Rule: పుష్ప 2 ప్రమోషన్స్ లో తగ్గేదేలే… టీజర్ ప్రచారానికి అన్ని కోట్లా!

Pushpa 2 The Rule: అల్లు అర్జున్ స్ట్రాంగ్ పీఆర్ టీమ్ కలిగి ఉన్నారు. సౌత్ టు నార్త్ ఆయన్ని ఈ టీమ్ ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తుంది. అవుట్ సైడ్ టాలీవుడ్ బన్నీ పేరు వినిపించడంలో ఆయన పీఆర్ టీమ్ పాత్ర ఎంతగానో ఉంది. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ సీక్వెల్ తో బాహుబలి 2 రేంజ్ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. […]

Written By: Shiva, Updated On : April 8, 2023 9:23 am
Follow us on

Pushpa 2 The Rule

Pushpa 2 The Rule: అల్లు అర్జున్ స్ట్రాంగ్ పీఆర్ టీమ్ కలిగి ఉన్నారు. సౌత్ టు నార్త్ ఆయన్ని ఈ టీమ్ ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తుంది. అవుట్ సైడ్ టాలీవుడ్ బన్నీ పేరు వినిపించడంలో ఆయన పీఆర్ టీమ్ పాత్ర ఎంతగానో ఉంది. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ సీక్వెల్ తో బాహుబలి 2 రేంజ్ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. దాని కోసం మొదటి నుండి ప్రణాళికలు వేస్తున్నారు. దీనికి ప్రమోషన్స్ చాలా కీలకమని భావిస్తున్నాడు. విడుదలకు నెలల ముందు నుండే ఇండియా వైడ్ మూవీని పాప్యులర్ చేసేందుకు పూనుకున్నారు.

అల్లు అర్జున్ బర్త్ డే పురస్కరించుకుని పుష్ప ఎక్కడ? పేరుతో కాన్సెప్ట్ టీజర్ విడుదల చేశారు. టీజర్ పేరుతో మూవీ కథపై హింట్ ఇస్తూ మూడు నిమిషాల వీడియో రిలీజ్ చేశారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్లో రెండు మూడు గూస్ బంప్స్ సీన్స్ పడ్డాయి. అంచనాలు ఆకాశానికి చేరాయి. సాంకేతికంగా, కాన్సెప్ట్ పరంగా పుష్ప 2 టీజర్ ఉన్నతంగా ఉంది.

Pushpa 2 The Rule

ఈ క్రమంలో ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. పుష్ప 2 టీజర్ ప్రమోషన్ కోసమే కోట్లు ఖర్చు చేశారట. ఐదు భాషల్లో విడుదలైన పుష్ప 2 టీజర్ ప్రమోషన్స్ లో వివిధ పరిశ్రమలకు చెందిన పీఆర్ టీమ్స్ తో ఒప్పందం చేసుకున్నారట. దీని కోసం రూ. 4 కోట్లు ఖర్చు చేశారట. అసలు ఒక సినిమా పూర్తి స్థాయి ప్రమోషన్స్ కి కూడా ఇన్ని కోట్లు ఖర్చు చేయరు. కానీ జస్ట్ టీజర్ ని జనాల్లోకి తీసుకెళ్లడానికి పుష్ప టీమ్ భారీగా వెచ్చించారని టాక్.

ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. పుష్ప 2 బడ్జెట్ రూ. 300 కోట్లు అని అంచనా. పార్ట్ వన్ తో పోల్చుకుంటే ఇది రెండు రెట్లు అధికం. పుష్ప వరల్డ్ వైడ్ రూ. 360 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వెయ్యి కోట్ల టార్గెట్ తో పుష్ప 2 విడుదల చేస్తున్నారని సమాచారం. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్.