Homeజాతీయ వార్తలుRenuka Chaudhary- Modi: మోడీపైకి శూర్పణఖను ప్రయోగిస్తున్న కాంగ్రెస్

Renuka Chaudhary- Modi: మోడీపైకి శూర్పణఖను ప్రయోగిస్తున్న కాంగ్రెస్

Renuka Chaudhary- Modi
Renuka Chaudhary- Modi

Renuka Chaudhary- Modi: రాహుల్ గాంధీ పై పార్లమెంట్ వేటు వేసిన ఉదంతం ఇప్పట్లో సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. పైగా నేతలు రోజుకో కొత్త వివాదాన్ని తెర పైకి తీసుకొస్తున్నారు. మహారాష్ట్రలోని అక్కడి అసెంబ్లీలో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని అధికార పార్టీ నాయకులు చెప్పులతో కొట్టిన ఉతంతాన్ని మర్చిపోకముందే.. అలాంటి వ్యవహారాన్ని మరొక దానిని కాంగ్రెస్ పార్టీ మోడీకి వ్యతిరేకంగా తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ మాజీ సభ్యురాలు రేణుకా చౌదరి. సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక వివాదాస్పద మాట మాట్లాడటం ఈమె స్టైల్. ” నా చేతులకు ఉన్నది గాజులు కావు. విష్ణు చక్రాలు. దొంగలకు మోడీ సద్ది కడతాడు. బిజెపి అంటేనే మత పిచ్చి లేపే పార్టీ” ఇలా చెప్పుకుంటూ పోవాలే గానీ ఈమె నోటి నుంచి జాలువారే ఆణిముత్యాలకు కొదవ ఉండదు.

2018 ఫిబ్రవరి 7న రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నాయి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతుంటే అప్పటి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పగలబడి నవ్వింది.. రాజ్యసభ చైర్మన్ వారించినప్పటికీ ఆమె ప్రవర్తన తీరులో మార్పు రాదు. అప్పుడు మోడీ కల్పించుకొని ” నవ్వనివ్వండి, టీవీలో రామాయణం సీరియల్ ముగిశాక శూర్పణఖ నవ్వును వినే అవకాశం ప్రేక్షకులకు లేకుండా పోయింది” అని చలోక్తి విసిరాడు. దీంతో సభలో ఉన్న రేణుకాచౌదరి తప్పా అందరూ నవ్వారు.

అప్పుడు పోయిన పరువు… రేణుకా చౌదరికి ఇప్పుడు యాదికి వచ్చింది. ఎందుకంటే రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది కాబట్టి… లోక్ సభ స్పీకర్ కార్యాలయం దక్షిణ స్పందించి రాహుల్ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది.. దీనిపై ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ తో సహా గాయి గత్తర చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొదటినుంచి రాహుల్ గాంధీకి దగ్గరి ఫోల్డ్ లో ఉన్న రేణుకాచౌదరి ఇప్పుడు మోడీ మీద కేసు వేస్తా అని అంటున్నది. రాహుల్ గాంధీ మీద స్పందించిన వేగంగా న్యాయవ్యవస్థ వేగంగా పనిచేస్తుందా అని ఒక ప్రకటన చేసింది.

Renuka Chaudhary- Modi
Renuka Chaudhary- Modi

ఏదో ఒకటి మాట్లాడడమే తప్ప నేను ఏం మాట్లాడుతున్నాను అనే సోయి కూడా ఈ రాజ్యసభ మాజీ సభ్యురాలికి లేనట్టుంది.. ఏదో ఒకటి కూయాలి, వార్తల్లో నిలవాలి. ఇక్కడ రేణుకా చౌదరికి తెలియంది ఏంటంటే.. న్యాయ వ్యవస్థ వేగంగా స్పందిస్తే అందులో ఆక్షేపించేందుకు ఏమంటుంది? కోర్టును వేగంగా ఎందుకు తీర్పు చెప్పారు అని రేణుకా చౌదరి అడగగలుగుతుందా? చాలా రోజులు రాహుల్ గాంధీ పై కేసును హోల్డ్ లో పెట్టిన సూరత్ కోర్టు.. ( మధ్యలో హైకోర్టు స్టే ఇచ్చింది) ఆ కేసు వంతు వచ్చిన తర్వాతే తీర్పు చెప్పింది. అంతేగాని వేగంగా స్పందించలేదు. ఒక రకంగా ఇది న్యాయ వ్యవస్థను హేళన చేయడం లాంటిదే.

ఒకవేళ రేణుకాచౌదరి తప్పు పట్టాల్సి ఉంటే తక్షణం స్పందించిన స్పీకర్ ఆఫీసును తప్పుపట్టాలి.. చాలా తప్పు పడితే లోక్ సభ ఊరుకోదు. సో, ఇలా పాత మోడీ వీడియో బయటికి తీసి నేనూ కేసు వేస్తాను, శిక్ష వేస్తారా అంటూ రాహుల్ పై వీర విధేయత ప్రదర్శించింది. ఈ 68 ఏళ్ల నిప్పు బ్రాండ్ కు, కొన్ని సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఈమెకు పార్లమెంటు వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోదు అనే సోయి కూడా లేదు. ఒకవేళ ఈమె పరువుకు భంగం కలిగి ఉంటే అప్పుడే అభ్యంతరం చెప్పాల్సి ఉండేది.

ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆమెకు మోడీ అన్న మాటలు గుర్తుకొచ్చాయి.. ఇప్పుడు పరువు పోయిందని కోర్టుకు ఎక్కినా సరిగా ప్రయోజనం ఉండదు. శూర్పణఖ ఓ అందగత్తె.. బాగా నవ్వుతుంది. తన అందంతో లక్ష్మణుడిని వలపు వలలో పడేయాలి అనుకుంది. పైగా శూర్పణఖ రామాయణంలో ఓ బాధితురాలు మాత్రమే. ఆమెతో పోల్చితే రేణుకా ఎందుకు అంత ఇబ్బంది పడిందో, మోడీపై ఎందుకు కేసు పెడతా అంటుందో? ఎంతకీ అంతుపట్టడంలేదు. ప్చ్. కాంగ్రెస్ కు ఈ కష్ట కాలం!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular