
బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా రానా మారిపోయాడు. అంతకుముందు పలు హిందీ చిత్రాల్లోనూ నటించి అందరికీ సుపరిచితం అయ్యాడు. అయితే తెలుగు నాట సింగిల్ హీరోగా మాత్రం రానా అంత సక్సెస్ కాలేకపోయాడు.అయినప్పటికీ అతడి రెమ్యూనరేషన్ ఏ మాత్రం తక్కువ కాదని తెలిసింది.
రానా బాలీవుడ్ లో.. టాలీవుడ్ లోనైనా సినిమాకు 5 కోట్లకు పైగానే తీసుకుంటాడట.. తాజాగా అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో పవన్ తో కలిసి నటించేందుకు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఈ మల్టీస్టారర్ లో నటించేందుకు రానాకు భారీ పారితోషికం దక్కినట్టు ఇండస్ట్రీ టాక్.
తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఒక గ్రామంలో ఒక పోలీస్ అధికారి, మాజీ మిలటరీ అధికారి మధ్య సాగే పోరాటం గూస్ బాంబ్స్ తెప్పిస్తుంది. ఇందులో పవన్, రానా పోటాపోటీ చూడబోతున్నాం.
అయితే తక్కువ కాల్ షీట్లు మాత్రమే ఇచ్చిన రానా ఈ సినిమాకు రూ.5 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. సినిమా త్వరగా పూర్తి చేస్తారని.. తక్కువ రోజులు కావడంతో రానా కాంప్రమైజ్ అయ్యాడని తెలుస్తోంది.