Unstoppable With Nbk- Prabhas Gopichand: పరిశ్రమలో అనుష్క శెట్టి వివాద రహిత హీరోయిన్. దర్శక నిర్మాతలు, తోటి నటులు ప్రతి ఒక్కరు అనుష్కను ప్రేమిస్తారు, అభిమానిస్తారు. అనుష్క శెట్టిపై ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఎంత ఎదిగా ఒదిగి ఉండే తత్త్వం ఆమెది. ఇంత సౌమ్యమైన గుణం కలిగిన అనుష్క పలు మార్లు ఎఫైర్ రూమర్స్ వెంటాడాయి. హీరోలు, సాంకేతిక నిపుణులతో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు వాదనలు ఉన్నాయి. కెమెరామెన్ సెంథిల్ కుమార్-అనుష్క మధ్య ప్రేమాయణం నడిచింది, వారు వివాహం చేసుకోవాలి అనుకున్నారనే వాదన ఉంది.

అనంతరం హీరో గోపీచంద్ తో అనుష్క ఎఫైర్ నడుపుతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఒక దశలో వీరిద్దరూ కలిసి వరుస చిత్రాలు చేశారు. మంచి ఒడ్డు పొడుగున్న జంటైన వీరు హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు. గోపీచంద్-అనుష్క జంటగా నటించిన లక్ష్యం మూవీ సూపర్ హిట్. గోపి చంద్ కెరీర్లో అతిపెద్ద హిట్ అని చెప్పొచ్చు. అనంతరం శౌర్యం చిత్రంలో జతకట్టారు. శౌర్యం సైతం హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈ సమయంలో అనుష్కను గోపీచంద్ వివాహం చేసుకుంటున్నారని పుకార్లు వినిపించాయి. ఇక ప్రభాస్ తో అనుష్క ఎఫైర్ రూమర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఐదారేళ్లుగా టాలీవుడ్లో ఇది హాట్ టాపిక్. అత్యధికంగా నాలుగు సార్లు జతకట్టిన ఈ జంటపై ఎఫైర్, పెళ్లి రూమర్స్ వినిపించాయి. వినిపిస్తున్నాయి. నలబై ఏళ్ళు దాటినా ఇద్దరూ వివాహం చేసుకోలేదు. ఈ ఎఫైర్ రూమర్స్ ని ఇద్దరూ కొట్టిపారేశారు.

ఇదిలా ఉంటే బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్, గోపీచంద్ పాల్గొన్నారు. 2008-09 ప్రాంతంలో ఒక హీరోయిన్ కోసం ఇద్దరూ కొట్టుకున్నారంటగా? అని బాలయ్య అడిగారు. బాలయ్య చెప్పిన కాలాన్ని పరిశీలిస్తే ఆ సమయంలో ప్రభాస్-గోపీచంద్ పని చేసిన కామన్ హీరోయిన్ అనుష్క మాత్రమే. 2007లో లక్ష్యం, 2008లో శౌర్యం విడుదలయ్యాయి. 2009లో బిల్లా చిత్రాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో గోపీచంద్-ప్రభాస్ హీరోయిన్ అనుష్క కోసం పోటీపడ్డారని తెలుస్తుంది. బాలయ్య ఇక్కడ పక్కా సమాచారంతోనే ఇద్దరినీ ఇరికించాడు. త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ తో క్లారిటీ రానుంది. ఈ హీరోలు అనుష్క పేరు బయటపెడతారో లేదో చూడాలి.