Fastest Fighter Jets: ఒకప్పుడు యుద్ధాలను కత్తులు, బాణాలతో మాత్రమే చేసేవారు. కొంతకాలానికి ఆయుధాలు వాడే విధానంలో తేడా వచ్చింది.. ముఖ్యంగా కాలం మారిన కొద్దీ యుద్ధాలు చేసే తీరు కొత్త పుంతలు తొక్కుతోంది. యుద్ధం అంటే శత్రు నాశనమే కాబట్టి.. దానికోసం అధునాతన యంత్రాలు తయారవుతున్నాయి. అప్పట్లో ఇరాక్ పై అమెరికా యుద్ధం చేసినప్పుడు ఫైటర్ జెట్ విమానాలు వాడింది. వాటిని ప్రపంచమంతా ఆశ్చర్యంగా చూసింది. కానీ అలాంటి ఫైటర్ జెట్లకు మించిన పెద్ద యుద్ధ విమానాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకీ వాటి ప్రత్యేకతలు ఏంటంటే..
మాక్1, 2
ఈ ఫైటర్ జెట్ లు ధ్వని కంటే రెండింతల వేగంగా వెళ్తాయి. వీటిని సూపర్ సోనిక్, సబ్ సోనిక్, ట్రాన్స్ సోనిక్ గా వర్గీకరించారు. ఇవి మల్టీ ఆపరేషన్లు చేయగలవు. అమెరికా, రష్యా వంటి దేశాలు అనేక యుద్ధాలలో ఈ ఫైటర్ జెట్ లను ఉపయోగించాయి.
IAI Kfir
ప్రపంచంలోనే ఎనిమిదవ అత్యంత వేగవంతమైన యుద్ధ విమానం. ఇది గంటకు 2,440 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మల్టీ ఆపరేషన్లలో ఉపయోగపడుతుంది.. ఎంతటి కఠిన వాతావరణంలో నైనా ప్రయాణం చేయగలుగుతుంది.
MIG 29 మాక్ 2.3
ఇది ప్రపంచంలోనే ఏడవ వేగవంతమైన యుద్ధ విమానం.. బ్రిటన్, అమెరికా వంటి దేశాలు ఈ యుద్ధ విమానాన్ని పలు సందర్భాల్లో వాడాయి. ఇది గంటకు 2,450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఆకాశంలో చక్కర్లు కొడుతున్నప్పుడు ఉరుము లాంటి శబ్దం చేసుకుంటూ వెళ్తుంది.
గ్రుమ్మన్ F-14 TOM CAT
ఇది అత్యంత ఆధునికమైన యుద్ధ విమానం.. మల్టీ ఆపరేషన్లు చేస్తుంది.. ఈ యుద్ధ విమానం వేగం విభాగంలో ఆరవ స్థానం సంపాదించింది. ఇది గంటకు 2,485 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
MIG-23 మాక్ 2.35
అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, రష్యా, చైనా వంటి దేశాలు వివిధ యుద్ధాల్లో ఈ యుద్ధ విమానాలను వినియోగించాయి. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ యుద్ధ విమానాలను ఆధునికీకరించాయి. ఇది గంటకు 2,499 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వేగం విషయంలో ఇది ఐదవ స్థానంలో ఉంది.
సుఖోయ్ ఎస్ యూ -27
సోవియట్ యూనియన్ లో పావోల్ సుఖో య్ ఈ యుద్ధ విమానాన్ని తయారు చేశారు. ఆ తర్వాత అనేక మార్పులకు గురై ఎస్ యూ -27 అనే రకాన్ని రూపొందించారు.. ఈ యుద్ధ విమానాలను రష్యా పలు దేశాలకు విక్రయించింది. ఇది గంటకు 2,500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.. తద్వారా అత్యంత వేగంగా ప్రయాణించే నాలుగో యుద్ధ విమానంగా ఇది రికార్డు సృష్టించింది.
Mc donnell Douglas f-15 eagle
ఈ యుద్ధ విమానం చూడడానికి గద్దలాగే ఉంటుంది. దానికి వాడిన రంగు కూడా దాదాపు అలానే ఉంటుంది. ఆకాశంలో గద్ద ఎలాగైతే ఎగురుతుందో.. ఈ యుద్ధ విమానం కూడా అలాగే చక్కర్లు కొడుతుంది. ఇది గంటకు 2,655 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వేగ విషయంలో మూడవ అతిపెద్ద యుద్ధ విమానంగా ఇది రికార్డు సృష్టించింది.
మిగ్ -32 మాక్ 2.83
ప్రపంచంలోనే అత్యున్నత యుద్ధ విమానాల్లో ఇది ఒకటి.. తారాజువ్వలాగా రయ్యిన దూసుకుపోతుంది. లక్ష్యాలను ఛేదించడంలో దిట్ట. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల వద్దే ఈ యుద్ధ విమానాలున్నాయి. ఇది గంటకు మూడు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. తద్వారా రెండో అతిపెద్ద వేగవంతమైన యుద్ధ విమానంగా దీనికి పేరుంది.
మిగ్ 25 మాక్ 2.83
ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన యుద్ధ విమానం. ఇది గంటకు మూడు వేల కిలోమీటర్ల సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. కళ్ళు మూసి తెరిచేలోపు లక్ష్యాలను చేదిస్తుంది. ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా ఈ యుద్ధ విమానం ప్రయాణం సాగించగలదు. దీనిని అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు అరుదైన ఆపరేషన్లలో ఉపయోగించాయి.