Faria Abdullah: జాతిరత్నాలు మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకుంది చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా. ఈ హైదరాబాద్ భామ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ అయ్యారు. యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ కామెడీ, రొమాంటిక్ రోల్ కి ఫరియాను ఎంచుకున్నారు. ఇక ఫస్ట్ మూవీతోనే బంపర్ హిట్ అందుకుంది. చిట్టిగా ఫరియా ఇన్నోసెంట్ కామెడీ ఓ రేంజ్ లో నవ్వులు పూయించింది. బ్రహ్మానందంతో ఫరియా కోర్ట్ రూమ్ సన్నివేశాలు హైలెట్ అని చెప్పాలి. ఇచ్చేయండి సార్.. బెయిల్ ఇచ్చేయండి, అని ఫరియా చెప్పే డైలాగ్ భలే నవ్వు తెప్పిస్తుంది.

2021లో ఆల్ టైం హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన జాతిరత్నాలు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ కి కాసులు కురిపించింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ అద్భుతమైన కామెడీ కాంబోగా పేరు తెచ్చుకున్నారు ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే’ సాంగ్ యూత్ ని ఊపేసింది. జాతిరత్నాలు చిత్రంతో ఫేమ్ తెచ్చుకున్న ఫరియా కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది.
ఫరియా హీరోయిన్ గా లైక్ ‘షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’టైటిల్ తో మూవీ విడుదలైంది. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ మూవీకి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. జాతిరత్నాలు మూవీ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో చిన్న వాంప్ రోల్ చేశారు. అలాగే బంగార్రాజు చిత్రంలో ఫరియా ఐటెం నంబర్ చేయడం విశేషం. నెక్స్ట్ ఫరియా మాస్ మహారాజ్ రవితేజ మూవీలో కనిపించనున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న రావణాసుర చిత్రంలో ఫరియా నటిస్తున్నారు.

ఈ పొడుగు సుందరి కోలీవుడ్ లో సైతం అదృష్టం పరీక్షించుకోనుంది. వల్లి మయిల్ టైటిల్ తో కోలీవుడ్ లో ఓ మూవీ తెరకెక్కుతుండగా ఫరియా నటిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఫరియా చాలా యాక్టీవ్ గా ఉంటారు. తరచుగా ఈమె డాన్స్ చేస్తారు. ఫరియా గొప్ప డాన్సర్ . తన డాన్సింగ్ స్కిల్స్ సోషల్ మీడియా వేదికగా చూపిస్తూ ఉంటారు. ఈ మధ్య ఎక్కువగా హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఆ విధంగా దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఫరియా బాత్రూం పిక్స్ షేర్ చేసి షాక్ ఇచ్చింది. అమ్మడు ప్రైవేట్ ఫోటోలు చూసిన జనాలు షాక్ అవుతున్నారు.