Pawan Kalyan- Nandamuri Balakrishna: కడుపున పుట్టిన కొడుకు (నందమూరి బాలకృష్ణ) కంటే కూడా అభిమానం పెంచుకున్న పవన్ కళ్యాణ్ మాటలు ఇప్పుడు అన్న ఎన్టీఆర్ అభిమానులకు ఊరటనిస్తున్నాయి. బాలకృష్ణ కంటే పవన్ కళ్యాణ్ బెటర్ అని అందరూ కీర్తిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంతకీ బాలయ్య చేసిన తప్పేంటి? ఎందుకు ఆయనను విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను మెచ్చుకుంటున్నారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

ఏపీ సీఎం జగన్ తాజాగా ‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’ పేరును ‘వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ’గా మార్చేశాడు. ఇప్పుడు ఈ వివాదం ఏపీలో రాజుకుంటోంది. చంద్రబాబు నుంచి మొదలుపెడితే జూనియర్ ఎన్టీఆర్, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్, కమ్మ నేతలు, టీడీపీ అభిమానులు.. ఆఖరుకు వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ అభిమాన నేతలు వల్లభనేని వంశీ లాంటి వారు స్పందించారు. యార్లగడ్డ అయితే ఏకంగా జగన్ ఇచ్చిన పదవికి రాజీనామా చేసిపడేశారు.
ఈ వివాదంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ గా స్పందించారు. ఏపీలోని క్రైస్తవ మిషనరీలు, సంస్థల పేర్లు దమ్ముంటే మార్చాలని.. తెలుగువారికి ఎంతో సేవ చేసిన ఎన్టీఆర్ పేరు మార్చడం తప్పు అంటూ జగన్ ముఖం మీదే చెప్పేశాడు. ఎన్టీఆర్ పేరు మార్పుపై పోరాడుతామని స్పష్టం చేశారు.

ఇంత మంది ఇన్ని రకాలుగా మొత్తుకుంటున్నా కూడా.. అన్న ఎన్టీఆర్ రాజకీయ/సీనీ వారసుడు అయిన స్టార్ హీరో కం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాత్రం నోరు మెదపకపోవడమే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తండ్రి పేరు మార్చినా ఉలుకు పలుకూ లేని బాలయ్య తీరును కడిగేస్తున్నారు. జగన్ ను ఎందుకు అనడం లేదని.. చంద్రబాబు , జూనియర్ ఎన్టీఆర్ లు సైతం విమర్శిస్తున్న వేళ బాలయ్య ఎందుకు మౌనం దాల్చాడని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.