https://oktelugu.com/

Allu Arha : అల్లు అర్హ కోసం ఇంటి ముందు ఫ్యాన్స్ నినాదాలు… బయటకొచ్చి ఆమె చేసిన పనికి అందరూ షాక్!

Allu Arha : అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ ఫాలోయింగ్ లో దూసుకుపోతుంది. ఆరేళ్ళ ప్రాయంలోనే అభిమానులను సంపాదించింది. శాకుంతలం మూవీలో అల్లు అర్హ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఆమె కోసం ఫ్యాన్స్ ఏకంగా ఇంటికి వస్తున్నారు. గేటు దగ్గర నిలబడి నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. సాధారణంగా హీరోల ఇంటి ముందు ఫ్యాన్స్ నినాదాలు చేస్తూ ఉంటారు. వాళ్ళను చూసేందుకు దూర ప్రాంతాల నుండి వస్తారు. అల్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : April 20, 2023 / 08:39 PM IST
    Follow us on

    Allu Arha : అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ ఫాలోయింగ్ లో దూసుకుపోతుంది. ఆరేళ్ళ ప్రాయంలోనే అభిమానులను సంపాదించింది. శాకుంతలం మూవీలో అల్లు అర్హ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఆమె కోసం ఫ్యాన్స్ ఏకంగా ఇంటికి వస్తున్నారు. గేటు దగ్గర నిలబడి నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. సాధారణంగా హీరోల ఇంటి ముందు ఫ్యాన్స్ నినాదాలు చేస్తూ ఉంటారు. వాళ్ళను చూసేందుకు దూర ప్రాంతాల నుండి వస్తారు. అల్లు అర్జున్ నివాసం ఎదుట తరచుగా అభిమానులు అగుపిస్తూ ఉంటారు.

    ఇప్పుడు అర్హ కోసం వస్తున్నారు. కొందరు అభిమానులు అల్లు అర్హ అంటూ నినాదాలు చేయడంతో ఆ చిన్నారి బయటకు వచ్చింది. వారి వంక చూస్తూ రెప్పలు పైకి ఎత్తి కళ్ళను భయంకరంగా మార్చి భయపెట్టింది. అర్హను వెళ్ళ వద్దంటూ ఓ అమ్మాయి వారిస్తుంది. అయినా పట్టించుకోకుండా అర్హ వాళ్ళను చూసేందుకు వెళ్ళింది. అర్హ పక్కన ఉన్న అమ్మాయి లోపలి ఎత్తుకుని తీసుకుపోయింది.

    అల్లు అర్హ ధైర్యం చూసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. సమంత కూడా ఇదే విషయం చెప్పారు. శాకుంతలం సెట్స్ అల్లు అర్హ వందల మంది మధ్య ఎలాంటి బెరుకు లేకుండా నటించిందని కొనియాడారు. శాకుంతలం మూవీలో అర్హ పాత్ర గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకోవడం విశేషం. ఇంగ్లీష్ ఒక్క ముక్క రాని ఈ జనరేషన్ అమ్మాయి అర్హ అని గుణశేఖర్ పొగడ్తలతో ముంచెత్తారు. సినిమా డిజాస్టర్ అయినా అల్లు అర్హ పాత్ర హైలెట్ అన్న మాట వినిపించింది.

    శాకుంతలం మూవీలో అల్లు అర్హ బాల భరతుడు పాత్ర చేసింది. క్లైమాక్స్ లో వచ్చి మెరుపులు మెరిపించింది. అల్లు అర్హకు మంచి సీన్స్ పడ్డాయి. అప్పటి దాకా శాకుంతలం చిత్రం చూసి నీరస పడ్డ ప్రేక్షకులకు అల్లు అర్హ ఎంట్రీ ఉపశమనం అని చెప్పాలి. ఇక అల్లు అర్హ అంటే బన్నీకి ప్రాణం. ఇంట్లో ఉంటే అర్హతో ఆడుకోవడం ఎంతో ఇష్టమైన వ్యాపకం. ఈ చిచ్చరపిడుగు అప్పుడే సంచలనాలు చేస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటుంది.

    https://twitter.com/flawsomedamsel/status/1648983784912715776