https://oktelugu.com/

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ నటించిన “గంధడ గుడి” డాక్యుమెంటరీ టీజర్ రిలీజ్…

Puneeth Raj Kumar: దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ మంచి నటుడు మాత్రమే కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఎంతోమంది మనసు గెలుచుకున్నారు. ఇలా అతి చిన్న వయసులోనే విశేషమైన ఆదరణ దక్కించుకున్న పునీత్ మరణం తీరని లోటుగానే చెప్పుకోవాలి. పునీత్‌ ఈ లోకాన్ని విడిచిపోయి వారి కుటుంబ సభ్యులకు, చిత్ర పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిల్చారు. తాజాగా అప్పు ఎంతో ఇష్టపడి నటించిన ప్రకృతికి సంబంధించిన డాక్యుమెంటరీ టీజర్ రిలీజ్ అయింది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 6, 2021 / 09:01 PM IST
    Follow us on

    Puneeth Raj Kumar: దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ మంచి నటుడు మాత్రమే కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఎంతోమంది మనసు గెలుచుకున్నారు. ఇలా అతి చిన్న వయసులోనే విశేషమైన ఆదరణ దక్కించుకున్న పునీత్ మరణం తీరని లోటుగానే చెప్పుకోవాలి. పునీత్‌ ఈ లోకాన్ని విడిచిపోయి వారి కుటుంబ సభ్యులకు, చిత్ర పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిల్చారు. తాజాగా అప్పు ఎంతో ఇష్టపడి నటించిన ప్రకృతికి సంబంధించిన డాక్యుమెంటరీ టీజర్ రిలీజ్ అయింది. పునీత్ తల్లి పార్వతమ్మ రాజ్‌కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ టీజర్ ను యూనిట్ విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్ పునీత్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వారు పేర్కొన్నారు.

    ఇక ఈ టీజర్ ప్రకృతి ప్రేమికులకు విజువల్ ట్రీట్‌ అని చెప్పాలి. ఈ డాక్యుమెంటరీ కర్ణాటక అడవులు, సుందరమైన బీచ్‌లు, నదీనదాల అందాలను.. ప్రకృతి లోని ప్రపంచాన్ని అన్వేషిస్తుంది. కర్నాటక అడవుల్లో పరిరక్షణ కోసం సుప్రసిద్ధ వన్యప్రాణి చిత్ర నిర్మాత అమోఘవర్ష జెఎస్‌తో పునీత్ జతకట్టారు. పునీత్ నటిస్తున్న ఈ డాక్యుమెంటరీ చాలా కాలంగా రూపొందుతోంది. ఈ డాక్యుమెంటరీకి “గంధడ గుడి” అనే పేరు పెట్టారు. గంధడ గుడి అంటే గంధపు చెక్కల గుడి అని అర్ధం. వచ్చే ఏడాది సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇక గంధడ గుడి డాక్యుమెంటరీ కర్ణాటకలోని అరణ్యాల పవిత్రతను, సంపదను రక్షించడం వంటి ప్రాముఖ్యతను వివరిస్తోంది. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.