
BB Jodi Winners 2023: గత ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రసారం చేసిన బిగ్ బాస్ సీజన్ 6 ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. గడిచిన అన్ని సీజన్స్ ఒకదాని తర్వాత ఒకటి భారీ హిట్స్ అయ్యి స్టార్ మా ఛానల్ ని ఇండియా లోనే నెంబర్ 1 ఛానల్ గా నిలిపింది.కానీ ఆఖరి సీజన్ మాత్రం దారుణంగా విఫలం అవ్వడం తో ఈసారి ఎలా అయినా మంచి రేటింగ్స్ సాధించాలని ‘BB జోడి’ అనే ప్రోగ్రాం ని ప్రారంభించింది.
ఈ ప్రోగ్రాం లో బిగ్ బాస్ లో అన్నీ సీజన్స్ లో పాల్గొన్న కొంతమంది కంటెస్టెంట్స్ ని తీసుకొని, జోడీలుగా చేసారు. డ్యాన్స్ రాని వీళ్ళని తీసుకొచ్చి ఏమి డ్యాన్స్ ప్రోగ్రాం చేస్తారు అని ముందుగా అందరూ అనుకున్నారు కానీ, ఆ తర్వాత ఈ జోడిల డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చూసి ప్రేక్షకులు సైతం నోరెళ్లబెట్టారు.
సుమారుగా పది జోడీలు ఈ షో లో పాల్గొనగా వారిలో టాప్ 5 జోడీలుగా అర్జున్ – వాసంతి, మెహబూబ్- శ్రీ సత్య , అవినాష్ – అరియనా, కాజల్ – చైతు మరియు ఫైమా – సూర్య నిలిచారు. అందరూ అర్జున్ కానీ మెహబూబ్ టీం కానీ గెలుస్తారని అనుకున్నారు. ఎందుకంటే మొదటి ఎపిసోడ్ నుండి నేటి వరకు ది బెస్ట్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది ఈ రెండు జంటలే.

కానీ ఈ రెండు జంటలకు కనీసం టాప్ 2 స్థానం కూడా దక్కకపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. వీళ్ళకి కాకుండా ఫైమా- సూర్య జంట టైటిల్ గెలుచుకున్నారు. టైటిల్ తో పాటుగా పాతిక లక్షల రూపాయిల క్యాష్ ప్రైజ్ కూడా దక్కింది. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది. చివరి ఎపిసోడ్ లో అందరికంటే వీళ్ళే బాగా డ్యాన్స్ చెయ్యడం తో వీరికి ఎక్కువ మార్కులు పడడం వల్ల వీళ్ళే గెలవాల్సి వచ్చింది. మొదటి నుండి ఆ రెండు జంటలు పడిన కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. వాస్తవానికి మెహబూబ్ – శ్రీ సత్య కి అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయట, కానీ చివరి నిమిషం లో టీం ఇచ్చిన ఆదేశాల మేరకు విన్నర్స్ పేర్లను మార్చాల్సి వచ్చిందని సోమికల్ మీడియా లో ఒక టాక్ నడుస్తుంది.