Father And Son Movies: టాలీవుడ్ ఇండస్ట్రీలో అనాధిగా మల్టీస్టారర్ సాంప్రదాయం కొనసాగుతోంది. ఒక హీరో చేసే సందడి కంటే ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపిస్తే ఆ మజాయే వేరు. అభిమానుల కోరికను గుర్తించిన కొందరు డైరెక్టర్లు మల్టీస్టారర్ చిత్రాలను తీసేందుకు ఆసక్తి కనబరుస్తారు . అయితే ఈ మల్టీ స్టారర్ లో ఇద్దరు వేరే వేరే హీరోలు కాకుండా ఒకే కుటుంబానికి చెందిన వారైతే ఫ్యాన్స్ కు పండుగే. అందులోనూ తండ్రీ కొడుకులు కలిసి వెండితెరపై కనిపిస్తే ఆ కిక్కే వేరు. కానీ ఇలాంటి ప్రయోగాలు చేయడానికి చాలా మంది డైరెక్టర్లు ముందుకు రారు. ఎందుకంటే ఆ సినిమా హిట్టయితే పర్వాలేదు. కానీ నెగెటివ్ టాక్ వస్తే మాత్రం ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా సాహసం చేసి కొందరు డైరెక్టర్లు తండ్రీ కొడుకులతో కలిసి సినిమా తీశారు. ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తోంది. అయితే తండ్రీ కొడుకులు కలిసి స్క్రీన్ పంచుకున్నా కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు రాలేదు. మరి ఇలా తండ్రి కొడుకులు కలిసి నటించి… డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలేవో చూద్దాం..
-ఎన్టీఆర్-బాలకృష్ణ:
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోగా కొనసాగిన ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి చాలా మంది నటులు సినిమాల్లోకి వచ్చారు. వారిలో ఆయన కుమారుడు బాలకృష్ణ స్టార్ హీరోగా మారాడు. అలాగే హరికృష్ణ సైతం ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ -బాలకృష్ణ కలిసి ‘అక్బర్ సలీం అనార్కలీ’, ‘సింహం నవ్వింది’ వంటి సినిమాల్లో నటించారు. కానీ ఈ సినిమాలు ప్లాప్ అయ్యాయి.
Also Read: KGF Real Story: కేజీఎఫ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఏంటో తెలుసా?
-ఏఎన్నార్- నాగార్జున:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖంగా ఉన్న మరో ఫ్యామిలీ అక్కినేని నాగేశ్వర్ రావు కుటుంబం. ఈ కుటుంబం నుంచి చాలా మంది నటులు ఇండస్ట్రీలో ఏదో ఒక రంగంలో కొనసాగుతున్నారు. ఇక నాగేశ్వర్ రావు కుమారుడు నాగార్జున స్టార్ హీరోగా మారిన విషయం తెలిసిందే. అయితే తండ్రీ కొడుకులు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. వాటిలో ప్లాప్ తెచ్చుకున్నవి ‘అగ్ని పుత్రుడు’, ‘ఇద్దరూ ఇద్దరే..’
-కృష్ణ -మహేశ్ బాబు:
సూపర్ స్టార్ కృష్ణ కు ప్రత్యేకత వేరు. ఆయన కుమారుడు మహేశ్ బాబు బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచే కృష్ణ, మహేశ్ బాబులు కలిసి నటించారు. అయితే మహేశ్ బాబు హీరోగా అయ్యాక ‘వంశీ’, ‘టక్కరి దొంగ’ సినిమాల్లో కృష్ణతో కలిసి నటించారు. ఈ సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి.
-మోహన్ బాబు -విష్ణు:
మోహన్ బాబు, విష్ణు కలిసి చాలా సినిమాల్లో నటించారు. అయితే వీరు నటించిన ‘గేమ్’, ‘గాయత్రి’ వంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి.
-మోహన్ బాబు -మనోజ్:
మోహన్ బాబు రెండో కుమారుడు మనోజ్ బాల నటుడిగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చిన్నప్పటి నుంచే మనోజ్ సినిమా పాఠాలు నేర్చుకున్నారు. అయితే ఆయన హీరోగా మారిన తరువాత ‘ఝుమ్మంది నాదం’, ‘పాండవులు, పాండవులు తుమ్మెద’ అనే సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు ప్లాప్ లుగా మిగిలాయి.
-మహేశ్ బాబు – గౌతమ్:
మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘నేనొక్కడినే’ సినిమాల్లో కలిసి నటించారు.ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
-సాయికుమార్ -ఆది:
డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న సాయికుమార్, తన కుమారుడు ఆది కలిసి చాలా సినిమాల్లో నటించారు. కానీ వీరు నటించిన ‘చుట్టాలబ్బాయి’ సినిమా ఫెయిల్ అయింది.
-బ్రహ్మానందం-గౌతమ్:
నవ్వుల రారాజు బ్రహ్మానందం ఆయన కుమారుడు గౌతమ్ కలిసి ఓ సినిమాలో నటించారు. ఈ సినిమాతో గౌతమ్ సినీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
-కృష్ణం రాజు-ప్రభాస్:
కృష్ణం రాజు, ప్రభాస్ లు కలిసి చాలా సినిమాల్లో నటించారు. కానీ వీరిద్దరు కలిసి నటించిన ‘రెబల్’, ‘రాదే శ్యామ్’ సినిమాలు ఫెయిల్ అయ్యాయి.
-చిరంజీవి-రామ్ చరణ్:
మెగాస్టార్ చిరంజీవి కలిసి కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో నటించారు.కానీ ఇటీవల రిలీజ్ అయిన ‘ఆచార్య’ సినిమాలో పూర్తిస్థాయిలో నటించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
Also Read:Prabhas Salaar: ప్రభాస్ రొమాన్స్ పూర్తి అయ్యింది.. మరోపక్క వీడియో క్లిప్ వైరల్ !
Recommended Videos: