https://oktelugu.com/

KTR- AP TDP Leaders: కేటీఆర్ పై గురిపెట్టి వైసీపీని కాలుస్తున్న టీడీపీ..

KTR- AP TDP Leaders: ఆంధ్రప్రదేశ్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు స్వాగతిస్తున్నారు ఏపీ దుస్థితిని కళ్లకు కట్టినట్లు చెప్పారని వేనోళ్ల పొగుడుతున్నారు. ఆ సమస్య జరిగి నాలుగు రోజులైనా ఇంకా టీడీపీ నేతలు కేటీఆర్ ను అదే పనిగా ప్రశంసిస్తున్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు సత్యమైనవేనని చెబుతున్నారు. దీంతో వైసీపీ నేతలు డైలమాలో పడ్డారు. తమకు ఎదురయ్యే ఇబ్బందులు తప్పించుకోవాలని చూస్తున్నా కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 3, 2022 / 10:42 AM IST
    Follow us on

    KTR- AP TDP Leaders: ఆంధ్రప్రదేశ్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు స్వాగతిస్తున్నారు ఏపీ దుస్థితిని కళ్లకు కట్టినట్లు చెప్పారని వేనోళ్ల పొగుడుతున్నారు. ఆ సమస్య జరిగి నాలుగు రోజులైనా ఇంకా టీడీపీ నేతలు కేటీఆర్ ను అదే పనిగా ప్రశంసిస్తున్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు సత్యమైనవేనని చెబుతున్నారు. దీంతో వైసీపీ నేతలు డైలమాలో పడ్డారు. తమకు ఎదురయ్యే ఇబ్బందులు తప్పించుకోవాలని చూస్తున్నా కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన గందరగోళానికి ఇప్పట్లో తెర పడేటట్లు కనిపించడం లేదు.

    KTR- Nara Lokesh

    మంత్రి కేటీఆర్ కూడా ఎందుకు ఏపీపై ఇంత అక్కసు వెళ్లగక్కారు. ఎప్పుడు కూడా జగన్ ను పల్లెత్తు మాట అనని కేటీఆర్ ఉన్నపళంగా విమర్శలు చేయడంతో అందరు ఆశ్చర్యపోయారు. ఏపీతో కేటీఆర్ కు ఏం పని అని వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందించినా మొత్తానికి రాజకీయ వేడిని పెంచింది. దీంతో రెండు రాష్ట్రాల్లో సంబంధాలు దెబ్బ తింటాయనే ఉద్దేశంతో కేటీఆర్ తరువాత సర్దుకున్నారు. అయినా టీడీపీ నేతలు మాత్రం దాన్ని పట్టుకునే వేలాడుతున్నారు. కుక్కకు బొక్క దొరికినట్లు అయింది.

    Also Read: PM Modi- Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో విజేతలుండరని మోడీ సంచలన వ్యాఖ్యలు

    జేసీ ప్రభాకర్ రెడ్డి, అశోక గజపతి రాజు లాంటి నేతలు కేటీఆర్ వ్యాఖ్యలు కరెక్టే అని చెప్పడంతో రాష్ట్రంలో పరిణామాలు మారుతున్నాయి. లోకేష్ సైతం కేటీఆర్ వ్యాఖ్యలు సబబే అని చెబుతున్నారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యల కలకలం రేగుతూనే ఉంది. జగన్ కు మాత్రం కంటగింపుగా మారుతోంది. అయితే జగన్ ను తిడితే టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. మరి పొగిడితే కూడా ఇలాగే చేస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నా వారి ప్రచారం ఆగడం లేదు.

    KTR

    మొత్తానికి రాష్ట్రంలో పార్టీల మధ్య ప్రచార మేనియా కొనసాగుతోన్నట్లు తెలుస్తోంది. వైసీపీని టార్గెల్ చేసుకుని టీడీపీ నేతలు చెలరేగుతున్నారు. దీనివల్ల ప్రయోజనం లేకపోయినా వారికి దొరికిన పండుగా భావించి అందరు ఆరగించాలని చూస్తున్నారు. వైసీపీని ఎండగట్టే క్రమంలో వారికి దొరికిన ఓ అవకాశంగా తీసుకుంటున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. దీని వెనుక ఏదో కారణం ఉంటుందనే అభిప్రాయాలు అందరిలో వస్తున్నాయి.

    కేటీఆర్ జగన్ పై ఎందుకు ఇలాంటి కామెంట్ చేశాడో ఎవరికి అంతుచిక్కడం లేదు. ఎప్పుడైనా పక్క రాష్ట్రం వారితో జాగ్రత్తగా ఉండే కేటీఆర్ ఒక్కసారిగా ఏపీపై విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో టీడీపీకి ఇదో అవకాశంగా తీసుకుని కేటీఆర్ వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని వైసీపీని కాల్చుతున్నారు. ఇంకా ఈ మంటలు ఎప్పటికి చల్లారునో తెలియడం లేదు. కాలమే నిర్ణయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    Also Read:Rahul Gandhi Visit To Telangana: రాహుల్ గాంధీ టూర్.. కేసీఆర్ ఈసారి ఎలా ట్రీట్ చేస్తాడో?

    Recommended Videos:

    Tags