Ex Boy Friend Abducted: తీసుకున్న బాకీ చెల్లించలేదని ఓ మాజీ ప్రియుడిని ప్రియురాలే కిడ్నాప్ చేయించిన సంఘటన బెంగాల్ లో చోటుచేసుకుంది. బెంగాల్ లోని బెలియాఘటా ప్రాంతానికి చెందిన తమల్ అధికారి (22), కెస్తోపూర్ కు చెందిన టీనేజీ అమ్మాయి (18) ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య కొంత కాలం మంచి సంబంధం కొనసాగింది. ఆ సమయంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ కు రూ. 30 వేలు ఇచ్చింది. తరువాత వారి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. దీంతో ప్రేమకు దూరంగా ఉన్నారు. దీంతో తన డబ్బు ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఓ ప్లాన్ వేసింది. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకునేందుకు పక్కా పథకం వేసింది.

తన మాజీ బాయ్ ఫ్రెండ్ ను కిడ్నాప్ చేయాలని భావించింది. ఇందులో భాగంగానే ప్రస్తుత బాయ్ ఫ్రెండ్, అతడి స్నేహితుల సాయం తీసుకుంది. పక్కాగా ప్లాన్ చేసింది. తనతో మాట్లాడేది ఉందని మాజీ ప్రియుడిని ఆహ్వానించింది. దీంతో అతడు ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు. అదను కోసం చూసిన వారు అతడిని కిడ్నాప్ చేసి లేడీస్ పార్కులోని ఇంట్లో బంధించారు. అతడి తండ్రికి ఫోన్ చేసి బెదిరించారు. రూ. లక్ష ఇస్తేనే మీ కొడుకును విడిచి పెడతామని చెప్పడంతో వారు ఖంగుతిన్నారు.
మొదట లక్ష రూపాయలు డిమాండ్ చేసి తరువాత రూ. 30 వేలు ఇస్తేనే విడిచిపెడతామనడంతో అతడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారు రంగప్రవేశం చేసి నిందితులను పట్టుకున్నారు. వారిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓ యువతి తన మాజీ ప్రియుడి వద్ద డబ్బులు తీసుకునే క్రమంలో కిడ్నాప్ కు తెగించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అచ్చం సినిమా ఫక్కీలో జరిగిన డ్రామాగా గుర్తిస్తున్నారు. టీనేజీలో ఉన్న ఓ అమ్మాయి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడంపై ఆలోచనలు వస్తున్నాయి.

తన దగ్గర తీసుకున్న డబ్బులు వసూలు చేసుకునే సందర్భంలో అచ్చం సినిమాల్లో లాగా కిడ్నాప్ చేయించి డబ్బులు డిమాండ్ చేయడం చూస్తుంటే నేర ప్రవృత్తి ఎంతలా పెరిగిపోతోందో అర్థమవుతోంది. టీనేజీలో ఉండే వారే ఇంత దారుణంగా ప్రవర్తిస్తే భవిష్యత్ తరాలు ఇంకా ఎలా ఉంటాయోననే బెంగ అందరిలో పట్టుకుంది. మొత్తానికి బెంగాల్ ఘటన అందరిలో కలవరం కలిగేలా చేస్తోంది. ఈ క్రమంలో టీనేజీలో వస్తున్న మార్పులకు నిదర్శనమే ఈ ఘటన అని చెబుతున్నారు.