Esther Anil : వెండితెరపై చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన ఎంతో మంది ఇప్పుడు హీరోలు.. హీరోయిన్లుగా వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు. పెద్దయ్యాక వారిని చూస్తే నిజంగానే ఆశ్చర్యపోయేలా ఉన్నారు. వారిని చూసి ఎంత పెద్దగా ఎదిగారో అని అవాక్కైన పరిస్థితి నెలకొంది.
దృశ్యం సినిమాలో వెంకటేశ్ చిన్న కూతురుగా చేసిన ఈ చిన్నారి పాప ఇప్పుడు పెరిగి పెద్దదైంది. హీరోయిన్ కటౌట్ లోకి మారింది. ఆమెను ఇప్పుడు చూసిన జనాలు చూసి షాక్ అవుతున్నారు. అసలు ఆ పాప ఈమెనే అని ముక్కునవేలేసుకుంటున్నారు.
Also Read: MLA Etela Rajender: ఈటలకు మింగుడు పడని బీజేపీ వ్యవహారం… పార్టీ మారేందుకు సన్నద్ధం
నిజానికి దృశ్యం మూవీలో చిన్నగా ఉన్న పాప.. దృశ్యం2 సినిమాకు వచ్చేసరికి టీనేజ్ గర్ల్ గా సినిమాల్లో కనిపించింది. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ మాదిరి హోయలు ఒలుకుతోంది.
పెళ్లికూతురు సీరియల్ లో బాలనటిగా నటించిన అవికా గోరా కూడా ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. జైచిరంజీవి సినిమాలో చిన్నారిగా నటించిన శ్రియా శర్మ ఇప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది. ఈమె బాటలోనే ఇప్పుడు ‘ఎస్తేర్ అనిల్’ చేరింది. దృశ్యం చిత్రంలో హీరో వెంకటేశ్ చిన్న కూతురుగా ఈమె ఇండస్ట్రీలో అందరికీ చేరువైంది. అందులో క్యూట్ గా ఉన్న ఈపాప ఇప్పుడు హీరోయిన్ గా ఎదిగింది. ఆమె సోషల్ మీడియాలో పంచుకునే ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అందాలన్నీ ఆరబోస్తూ యువతకు హీట్ పెంచుతోంది.
2014లో రిలీజ్ అయిన మలయాళ ‘దృశ్యం’లో ఎస్తేర్ అనిల్ నటించింది. అప్పుడు ఈమె వయసు 12 ఏళ్లు. కానీ ఇప్పుడు ఆమె వయసు 19 ఏళ్లు. ఈ కేరళ కుట్టి ఇప్పుడు తెలుగులో ‘ఆహా ఓటీటీ’ రూపొందించిన సినిమాలో హీరోయిన్ గా నటించింది. పెద్ద చిత్రాల కోసం ఎదురుచూస్తోంది.
Also Read: Tollywood Heroes Politics: రాజకీయ నాయకులుగా స్టార్ హీరోలు…?
Recommended videos