Uttar Pradesh Train: భారత దేశంలో అతి పొడవైనది రైల్వే వ్యవస్థ. రోజూ లక్షల మంది ప్రజలు రైలులు ప్రయానిస్తూ ఉంటారు. కొందరు దూర ప్రాంతాలకు..మరికొందరు ఇంటర్ సిటీ ప్రదేశాలకు నిత్యం ప్రయాణం సాగిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా 22,593 రైళ్లు యాక్టివ్ గా ఉన్నాయి. ఇందులో 2 కోట్లకు పైగా నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక ట్రైన్ మరో ట్రైన్ కు టచ్ కాకుండా ప్రయాణాలు సాగిస్తూ ఉంటాయి. ఒక్కోసారి టైమింగ్ మిస్ కావడం వల్ల రెండు రైళ్లు ఢీకొట్టిన సంఘటనలు ఉన్నాయి.. అలాగే రైలు పట్టాల్లో సమస్యలు వస్తే రైలు పక్కకు ఒరిగిపోయి ప్రమాదాలు జరిగాయి. అయితే ఇక్కడి రైలు మాత్రం ఎవరూ ఊహించని విధంగా ప్లాట్ ఫాం పైకి దూసుకొచ్చింది. అసలేం జరిగింది?
సాధారణంగా కొందరు బైక్ పై విన్యానాలు చేస్తుంటారు. కొందరు కారు డ్రైవింగ్ లో నైపుణ్యం ఉన్నవారు ప్రయోగాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ రైలు ఫైలట్ కూడా అలా చేసినట్లు రైలు అమాంతం ప్లాట్ పాం పైకి దూసుకురావడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిచింది. ఉత్తరప్రదేశ్ లోని మధుర స్టేషన్ లోని ప్రయాణికులంతా తమ గమ్యాలను చేరేందుకు ఎదురుచూస్తున్నారు. రాత్రి 11 గంటల అవుతున్నందున పెద్దగా రద్దీ లేదు.
ఇదే సమయంలో షకుర్ బస్తీ నుంచి వచ్చిన ఓ రైలు రాత్రి 10.49 గంటలకు మధుర స్టేషన్ కు వచ్చి ఆగింది. అందులోని ప్రయాణికులంతా దిగారు. దాదాపు ఇదే స్టేషన్ చివరిది కావడంతో అందులో ఒక్క ప్రయాణికుడు కూడా లేరు. అయితే ఆగి ఉన్న రైలు ఉన్నట్టుండి ప్లాట్ ఫాం పైకి దూసుకొచ్చింది. రైలులో, రైలు దూసుకొచ్చిన ప్రదేశంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ రైలు ఇలా అకస్మాత్తుగా ప్లాట్ ఫాం పైకి దూసుకురావడంపై అక్కడున్నవారంతా షాక్ అయ్యారు.
ఈ సంఘటనపై మధుర స్టేషన్ డైరెక్టర్ ఎస్ కే శ్రీవాస్తవ వివరణ ఇచ్చారు. 22.50 గంటలకు రైలు మధుర స్టేషన్ కు చేరుకుందన్నారు. 5 నిమిషాల తరువాత ఓవర్ హెడ్ ఎక్విప్ మెంట్ ను బద్దలు కొట్టి ప్లాట్ ఫాం పైకి దూసుకొచ్చిందని అన్నారు. దీని వల్ల ప్లాట్ ఫాం పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. అయితే ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నట్లయిందని ఆయన చెప్పారు. అయితే ఇలా ఎందుకు జరిగిందో దర్యాప్తు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.
#WATCH | Uttar Pradesh: An EMU train coming from Shakur Basti derailed and climbed the platform at Mathura Junction. (26.09) pic.twitter.com/ZrEogmvruf
— ANI (@ANI) September 26, 2023