Bigg Boss 6 Telugu- Revanth: బిగ్ బాస్ సీజన్ 6 ఎన్నో ట్విస్టులు, భావోద్వేగాల నడుమ మొత్తానికి చివరి వారం లోకి చేరింది..గత వారం ఇనాయ ఎలిమినేట్ అయ్యిపోగా..టాప్ 6 కంటెస్టెంట్స్ గా రేవంత్ , ఆది రెడ్డి , శ్రీహన్ , శ్రీ సత్య , కీర్తి మరియు రోహిత్ మిగిలారు..చివరి వారం కాబట్టి కంటెస్టెంట్స్ అందరికి సంబంధించిన బిగ్ బాస్ జర్నీ ప్రత్యేకమైన సెటప్ లో అద్భుతమైన AV లను ప్లే చేసారు.

ముందుగా రేవంత్ ని గార్డెన్ ఏరియా కి పిలిచి అతని బిగ్ బాస్ జర్నీ కి సంబంధించిన ఫోటోలు, టాస్కులలో అతను ఆడిన తీరు ఇవన్నీ గార్డెన్ ఏరియా లో వరుసగా పెట్టారు..ఇక ఆ తర్వాత ఫోన్ భూత్ లో ఫోన్ మోగుతుంది..రేవంత్ భార్య పెట్టిన వోసీఏ మెసేజి ని ప్లే చేస్తాడు బిగ్ బాస్..ఆ వాయిస్ నోట్ లో ‘నేను గర్భవతి అయ్యినప్పుడు నువ్వు నా పక్కన లేవు..నాకు చాలా బాధ వేసింది..కానీ ఇన్ని రోజులు నువ్వు లేని లోటుని పూడ్చాలంటే టైటిల్ ని గెలుచుకొని రావాలి’ అని అంటుంది.
ఇక ఆ తర్వాత రేవంత్ బిగ్ బాస్ జర్నీ ని ప్రొజెక్టర్ ద్వారా వేసి చూపిస్తారు..ఇన్ని రోజులు ఆయన ఆడిన ఆట..చేసిన అల్లరి మొత్తం చూపిస్తారు..అంతే కాకుండా కోపం వచ్చినప్పుడు అతను తన తోటి కంటెస్టెంట్స్ తో ప్రవర్తించిన తీరు..వెంటనే వెళ్లి క్షమాపణలు అడగడం వంటివి చూపిస్తారు..ఇక గీతూ ‘ఇలాంటోడు తొందరగా ఎలిమినేట్ అయ్యిపోయి వెళ్ళిపోతే మంచిది..అతని ప్రవర్తన రోజురోజుకి దిగజారిపోతోంది..భరించలేకపోతున్నాం’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ ని కూడా చూపిస్తాడు బిగ్ బాస్..ఇప్పటి వరుకు గీతూ తన గురించి అలా మాట్లాడిందని రేవంత్ కి తెలియదు.

ఇక ఆ తర్వాత శ్రీహాన్ – శ్రీ సత్య తో తనకి ఉన్న మంచి స్నేహం గురించి చాలాసేపు చూపించాడు..అవి చూస్తే వీళ్ళ మధ్య ఉన్నది ఎంత మంచి స్నేహం అనేది అర్థం అవుతుంది..అలా ఆయన బిగ్ బాస్ జర్నీ మొత్తం రకరకాల భావోద్వేగాల నడుమ కొనసాగినట్టు చాలా చక్కగా కట్ చేసి చూపించాడు బిగ్ బాస్..ఇంత అద్భుతంగా సాగిన రేవంత్ బిగ్ బాస్ జర్నీ కి ప్రతిఫలంగా టైటిల్ దక్కుతుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
