Elon Musk Father: మానవ సంబంధాలు గతి తప్పుతున్నాయి. వావివరసలు చూడటం లేదు. అచ్చం జంతువుల్లాగే ప్రవర్తిస్తున్నారు. అవి నోరు లేనివైనా కొన్ని పద్ధతులు పాటిస్తాయి. కానీ మనిషి మాత్రం తన సహజత్వానికి భిన్నంగా మసలుకుంటున్నాడు. సంభోగమంటే అదేదో వైభోగంగా మాత్రమే చూస్తున్నాడు. అందులో ఉన్న నైతిక విలువలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా పశువులకు మనకు తేడా కనిపించడం లేదు. కానీ వాటికి ఆలోచనా శక్తి లేదు. మనిషికి ఉన్నా పాటించడం లేదు. దీంతో విచ్చలవిడి శృంగారానికి పాల్పడుతున్నాడు. కూతురైనా సరే విడిచిపెట్టడం లేదు. చివరకు అత్యంత జుగుస్సాకరమైన రీతిలో మనిషి మనుగడ ఓ విచిత్రంలా మారుతోంది.

మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. వరుసకు కూతురుపై తండ్రిలా ఉండేవాడే పైశాచికం. కూతురుపైనే అఘాయిత్యం.. గర్భవతి అయిన బిడ్డ ఇలాంటి వార్తలు ఎన్నో వింటున్నాం. ఇక్కడ కూడా అతడో ప్రపంచ కుబేరుడు. అందరికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వాడు. కానీ చివరకు కూతురు వరసైన మహిళతో సంబంధం పెట్టుకుని బిడ్డను కనడం దారుణం. దీనికి సంబంధించి ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ విషయం బహిర్గతం చేయడం సంచలనం సృష్టిస్తోంది.
Also Read: Bill Gates: తన యావదాస్తిపై బిల్ గేట్సై్ సంచలన నిర్ణయం
మనిషా లేక పశువా అనే కోణంలో అందరు ఆలోచిస్తున్నారు. భార్య సవతి కూతురుపై లైంగిక దాడి చేసి ఆమెతో ఓ బిడ్డను కన్నట్లు స్వయంగా ప్రకటించడం వివాదానికి కేంద్ర బిందువు అయింది. మగాడు ఉన్నదే పునరుత్పత్తి చేయడానికని పైగా వేదాంతం చెప్పడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎర్రోల్ మస్క్ చేసిన ఘనకార్యానికి విమర్శలే వస్తున్నాయి. సాటి మగాడు చేయాల్సిన పని కాదని శాపనార్థాలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు. పైగా తానేదో సాధించినట్లు ప్రగల్బాలు పలకడం గమనార్హం.

76 ఏళ్ల ఎర్రోల్ మస్క్ 2019లో 35 ఏళ్ల వయసున్న బెజుడెన్ హౌస్ తో ఒక బిడ్డను కనడం సంచలనం కలిగించింది. అయితే అప్పటికే ఆమెకు ఓ కొడుకు కూడా ఉండటం తెలిసిందే. 1970లో ఎర్రోల్ మస్క్ మోడల్ మాయె హాల్డెమాన్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు కలిగారు. 1979లో జునా తల్లి హీడ్ ను వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు. జునా అందులో నాలుగు సంవత్సరాల పాప. 2017లో జునాను గర్భవతిని చేయడంతో ఎలాన్ మస్క్ తో పాటు అందరు వ్యతిరేకించారు. తండ్రి చర్యలను ఖండించారు. కానీ అతడు మాత్రం తనను సమర్థించుకున్నాడు.
ఇంకా భవిష్యత్ లో పిల్లలను కనాలని ఉందని ఎర్రోల్ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వయసులో ఇంకా సంభోగాలు జరిపి పిల్లల్ని కంటానని బాహాటంగా ప్రకటించడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎర్రోల్ మస్క్ జీవితం ఇంత దుర్భరమా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కూతురు వరసైన మహిళపై లైంగిక దాడి చేసి పిల్లను కనడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కానీ ఎర్రోల్ మస్క్ మాత్రం తాను చేసింది కరెక్టే అనే విషయం చెబుతుండటం మామూలు విషయం కాదు. మనుషుల్లో కూడా జంతువులు ఉన్నట్లు ఇలాంటి సంఘటనలు చూస్తే అర్థమవుతోంది.
Also Read:Mahesh Babu- Trivikram: మహేష్ సినిమాలో మరో హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరింది