Elnaaz Norouzi: ఇరాన్ లో గత కొంత కాలం నుండి హిజాబ్ కి నిరసనగా అక్కడి స్త్రీలు అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంఘటనలు ఇప్పుడు మీడియా లో ఎంత హాట్ టాపిక్ గా మారాయో మన అందరికి తెలిసిందే..రోజు రోజుకి ఈ నిరసన జ్వాలలు పెరగడమే తప్ప తగ్గడం లేదు..హిజాబ్ అంటే అక్కడి ఆడవాళ్ళూ దుస్తులు శరీరం మొత్తం కప్పేసినట్టు ఉండాలి..కళ్ళు తప్ప కనీసం తలా వెంట్రుకలు కూడా కనిపించకూడదు..దీనికి నిరసన గా చాలా కాలం నుండి అక్కడి స్త్రీలు ఇరాన్ ప్రభుత్వం పై ఎన్నో నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు..ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమాలలో అక్కడి సినీ తారలు కూడా చేతులు కలుపుతున్నారు..తాజాగా ఇరాన్ బ్యూటీ ఎల్నజ్ నౌరోజీ కూడా ఈ నిరసన కార్యక్రమంలో చేతులు కలిపారు..ఇల్నాజ్ నౌరోజీ నెట్ ఫ్లిక్స్ లో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా ‘స్క్విడ్ గేమ్స్’ అనే వెబ్ సిరీస్ లో నటించారు..ఈ వెబ్ సిరీస్ కి మన ఇండియా లో కూడా అద్భుతమైన ఆదరణ లభించింది.

ఆమె హిజాబ్ కి వ్యతిరేకంగా క్యాంపైన్ చేపడుతూ తానూ ధరించిన దుస్తులు అన్నిటిని విప్పేసి సోషల్ మీడియా లో పోస్టులు పెట్టింది..ఆ పోస్టులు ఇప్పుడు తెగ వైరల్ గా మారిపోయింది..’ఈ ప్రపంచం స్త్రీ తానూ ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండొచ్చు..ఇలానే ఉండాలి అని ఆంక్షలు విధించే హక్కు ఎవరికీ లేదు..ఎలాంటి దుస్తులు ధరించాలి అనేది కూడా ఆమె ఇష్టమే..ఎవరికీ ఆదేశించే హక్కులు లేదు’ అంటూ పోస్టు పెట్టింది..ఈ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది..కేవలం ఈమె మాత్రమే కాదు..ఇరాన్ ప్రతి పక్ష పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులతో పాటు..సినీ తారల మద్దత్తు కూడా రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది.

ఇటీవలే ఈ నిరసన కార్యక్రమాలలో భాగంగా 50 మంది ఉద్యమకారులు ప్రాణాలను కోల్పోయిన ఘటన హృదయాలను కలిచివేసేలా చేస్తుంది..ఈ నిరసన కార్యక్రమాలకు కేవలం ఇరాన్ దేశీయుల నుండే కాకుండా ఇతర దేశాల ప్రజల నుండి సోషల్ మీడియా లో సపోర్టు లభిస్తుంది..రోజు రోజుకి ఇరాన్ ప్రభుత్వం మీద పెరుగుతున్న ఈ వ్యతిరేకతకు తలవంచి ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.