https://oktelugu.com/

Bigg Boss 6 Telugu Geetu : నా వల్ల బిగ్ బాస్ మీద విరక్తి కలిగిన ప్రేక్షకులకు క్షమాపణలు చెప్తున్నాను..వైరల్ అవుతున్న గీతూ పోస్ట్

Bigg Boss 6 Telugu Geetu : కంటెస్టెంట్ గీతూ ఎలిమినేషన్ బిగ్ బాస్ సీజన్ 6లో అతిపెద్ద సంచలనం. షో బిగినింగ్ నుండి గేమ్ చూపించిన ఒకే ఒక కంటెస్టెంట్ గీతూ. బిగ్ బాస్ రివ్యూవర్ గా షో పట్ల ఆమెకు ఒక అవగాహన ఉంది. దీంతో ఆమె పక్కా ప్రణాళికతో వచ్చారు. తన మాటతీరు, ఆటతీరు ఎలా ఉండాలో గట్టిగా ఫిక్స్ అయ్యింది. తాను నమ్మిన దాన్ని మొదటి రోజు నుంచి అమలు చేయడం మొదలుపెట్టింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2022 / 09:03 AM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu Geetu : కంటెస్టెంట్ గీతూ ఎలిమినేషన్ బిగ్ బాస్ సీజన్ 6లో అతిపెద్ద సంచలనం. షో బిగినింగ్ నుండి గేమ్ చూపించిన ఒకే ఒక కంటెస్టెంట్ గీతూ. బిగ్ బాస్ రివ్యూవర్ గా షో పట్ల ఆమెకు ఒక అవగాహన ఉంది. దీంతో ఆమె పక్కా ప్రణాళికతో వచ్చారు. తన మాటతీరు, ఆటతీరు ఎలా ఉండాలో గట్టిగా ఫిక్స్ అయ్యింది. తాను నమ్మిన దాన్ని మొదటి రోజు నుంచి అమలు చేయడం మొదలుపెట్టింది. అది వర్క్ అవుట్ అయ్యింది కూడా. గీతూ ఆటతీరుకు బిగ్ బాస్ ఫిదా అయ్యాడు. కొన్ని వారాలు గేమ్ ఆమె చుట్టే నడిపాడు. ఈ పరిణామాలు గీతూలో మరింత ఆత్మవిశ్వాసం నింపాయి. ఇంకా బాగా ఆడాలనే తపనలో ట్రాక్ తప్పింది.

     

    అతి అనర్థం అన్నట్లు ఆమె గేమ్ ఎంటర్టైనింగ్ దశ దాటి అసహ్యం అనే దశకు చేరుకుంది. బిగ్ బాస్ రూల్స్ పాటించకుండా కొత్త రూల్స్ సెట్ చేయడం, హౌస్లో సాఫ్ట్ గా ఉండే రోహిత్, మెరీనాలను టార్గెట్ చేయడం, బాల ఆదిత్య వీక్నెస్ తో ఆడుకోవడం పూర్తిగా నెగిటివ్ మార్క్స్ పడేలా చేశాయి. రెండు వారాలుగా సోషల్ మీడియాలో గీతూపై విపరీతమైన నెగిటివిటీ నడుస్తుంది. స్టార్ మా బిగ్ బాస్ షోపై ఆడియన్స్ తో సోషల్ మీడియా చిట్ చాట్ చేయగా.. పలువురు గీతూ పట్ల ప్రతికూల అభిప్రాయాలు వెల్లడించారు.

    మొత్తంగా గీతూ ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. అయితే పోతూ పోతూ కూడా గీతూ కావాల్సినంత కంటెంట్ ఇచ్చిపోయింది. ఆమె లిటరల్ గా ప్రేక్షకులను ఏడిపించేసింది. గీతూకి బిగ్ బాస్ అంటే ఇంత ఇష్టమా? ఇన్ని ఆశలతో హౌస్ కి వచ్చిందా? అని ఫీల్ అయ్యారు. నేను పోను సార్ అని గీతూ ఏడుస్తుంటే ఆడియన్స్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ షో పట్ల తనకు ఎంత డెడికేషన్ ఉందో ఆదివారం ఎపిసోడ్ తో రుజువైంది.

    బరువైన హృదయంతో బయటకు వచ్చిన గీతూ తన ఫస్ట్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. సదరు పోస్టులో… బిగ్ బాస్ హౌస్లో నేను ఎన్నడూ చూడని ఒక అందమైన జీవితం అనుభవించాను. కాని అందులో నేను ఓడిపోయాను. మనుషుల విలువ తెలిసింది. నా తప్పులు క్షమించండి ప్లీజ్.నన్ను నన్నుగా అర్థం చేసుకొని సప్పోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చనిపోయే వరకు రుణపడి ఉంటాను. బిగ్ బాస్ షోలో నా ఆట ముగిసింది, అని కామెంట్ చేశారు. ఓడిపోయాననే బాధతో పాటు తప్పు చేశాననే రియలైజేషన్ ఆమెలో కనిపించింది.