Cow Attack In Kalyanpur: సాధారణంగా పాములు పగ పడుతుంటాయి. చూసో చూడకో పాములను తొక్కితే.. లేదా వాటికి అపాయం తలపెట్టాలి అని చూస్తే వెంటనే రెచ్చిపోతాయి. అమాంతం పడగవిప్పి చుక్కలు చూపిస్తాయి. కొన్ని సందర్భాలలో కాటు కూడా వేస్తాయి. అందువల్లే పాములకు దూరంగా ఉండాలి అంటారు. ఎలాంటి పామైనా సరే జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. పాములు మాత్రమే కాకుండా ఆవులు కూడా పగ పడతాయా.. ఆవులకు కూడా పగ ఉంటుందా.. అవి కోపంగా ఉంటే చుక్కలు చూపిస్తాయా.. ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానమే వస్తోంది.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఓ వీడియో ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కళ్యాణ్ పూర్ ప్రాంతంలో ఓ ఆవు వృద్ధుడిని వెంటాడింది. అతడిని పరిగెత్తించి పరిగెత్తించి కింద పడేసింది. కొమ్ములతో తీవ్రంగా దాడి చేసింది. తన గిట్టలతో తొక్కింది. ఆవు అతని మీదకి అలానే దూసుకు వస్తుండడంతో తట్టుకోలేకపోయాడు. కిందపడి ఆర్త నాదాలు చేశాడు. కాపాడండి కాపాడండి అంటూ వేడుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే అక్కడికి వచ్చారు. అవును బెదరగొట్టడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ ఆవు అక్కడినుంచి వెళ్లలేదు. గట్టిగా అరుస్తూ ఆవు అక్కడి వాతావరణం ఒక్కసారిగా భీకరంగా మార్చింది. దీంతో ఆ వృద్ధుడు మరింత ఇబ్బంది పడ్డాడు.
దీంతో స్థానికులు కర్రలతో కొట్టారు. అప్పటికి కూడా ఆవు ఆ వృద్ధుడిని వదిలిపెట్టలేదు. హీరో గానే ఒక ఆటో డ్రైవర్ అక్కడికి వచ్చాడు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించాడు. ఆటోలో ఆ వృద్ధుడిని పడుకోబెట్టాడు. అవును బెదిరించుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. అనంతరం గాయపడిన ఆ వృద్ధుడిని ఆస్పత్రిలో చేర్పించాడు. ఆ అవును గోశాలకు తరలించాడు. అయితే ఆ అవును వృద్ధుడు కొట్టాడా? లేదా బెదిరించాడా.. ఇంకా ఏమైనా చేశాడా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక ఆవు వృద్ధుడిని ఇలా వెంబడించి.. పరిగెత్తించి పరిగెత్తించి కింద పడేయడం.. దాడి చేయడం మాత్రం వింతలాగా అనిపిస్తోందని స్థానికులు అంటున్నారు.
పగబట్టిందా అన్నట్లుగా ఓ ఆవు రోడ్డుపై వెళ్తేన్న వృద్ధుడిపై దాడి చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. UPలోని కళ్యాణ్పూర్లో ఓ వృద్ధుడిని ఆవు వెంటాడింది. పరిగెడుతూ కింద పడిపోవడంతో కొమ్ములతో దాడి చేసింది. స్థానికులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించినా అది వెనక్కి తగ్గలేదు. దీంతో ఓ ఆటో… pic.twitter.com/FOJSrYDV2A
— ChotaNews App (@ChotaNewsApp) September 20, 2025