Health Alert: ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాహారం తీసుకుంటేనే ప్రయోజనం. మన ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్యం కోసం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏది పడితే అది దొరికింది కదా అని తింటే శరీరానికి హాని కలుగుతుంది. ఫలితంగా మన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. మన ఆహార అలవాట్లు మనకు చెడు చేసేవిగా ఉండకూడదు. కీడు చేసే వాటిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడమే శ్రేయస్కరం. లేదంటే మనకు రోగాల బాధ తీరని వేదనకు గురిచేస్తుంది. ఆరోగ్యం మందగిస్తే దాని దుష్ఫరిణామాలు మనల్ని బాధిస్తాయి. ఆరోగ్య సంరక్షణలో మనం చిట్కాలు పాటించాలి. ఉపాయాలతో మనకు అవసరమైన వాటిని తీసుకుని అవసరం లేని వాటిని దూరం చేయాలి. లేకుంటే మనం రోగాలకు దగ్గరవడం ఖాయం.

కొన్ని కూరలు కాంబినేషన్ లో తినకూడదు. తింటే ఆరోగ్యం చెడిపోవడం జరుగుతుంది. పాలకూరలో టమాటాలు వేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. పాలకూర టమాట కలిపి తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయని చెబుతున్నారు. ఇంకా పాలకూర పన్నీరుతో కూడా తినొద్దని హెచ్చరిస్తున్నారు. పాలకూరలో ఐరన్ ఉంటుంది. పన్నీరులో కాల్షియం ఉంటుంది. పాలక్ పన్నీరు తినొద్దని అంటున్నారు. పాలకూరలో ఉండే ఐరన్ ను పన్నీరులో ఉండే కాల్షియం మన శరీరానికి అందకుండా చేస్తుంది. అందుకే రెంటిని కలిపి తీసుకోవద్దు. ఐరన్ తో కాల్షియం తీసుకోకూడదు. పాలకూర బంగాళదుంప, పాలకూర మొక్కజొన్న వంటివి తీసుకోవడం ఉత్తమం.
పాలు, కాఫీ, టీ వంటివి తీసుకునే సందర్భంలో ఇతర పాల ఉత్పత్తులు కూడా తీసుకోవద్దు. పాలల్లో కాల్షియం ఉంటుంది. కందిపప్పు, బీన్స్ లో కూడా ఐరన్ సత్వాలు ఉంటాయి. వీటిని పెరుగు, మినపపప్పు, ఇతర పప్పులతో కలిసి తినకూడదు. మొత్తానికి కాల్షియం లభించే వాటిని ఐరన్ ఉన్న వాటితో జత పరిస్తే నష్టం కలుగుతుంది. కాల్షియం పదార్థాలు కూడా అన్ని కలిపి తీసుకోకూడదని సూచిస్తున్నారు. పాలకూర పన్నీరు కలిపి తీసుకోవడం వల్ల మనకు నష్టాలే ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మన దైనందిన జీవితంలో మనం తీసుకునే ఆహారాల విషయంలో ఎంతో సమతుల్యత పాటించాలి. లేదంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండదు. లేనిపోని రోగాలకు ఆలవాలమవుతుంది. ప్రస్తుత రోజుల్లో మనం తినకూడనివి ఎన్నో ఉన్నా లెక్క చేయడం లేదు. మద్యపానం, ధూమపానం వద్దన్నా ఆగడం లేదు. ఫలితంగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. మన రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచే విధంగా మన ఆహార అలవాట్లు ఉండాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.