TV9 Rajinikanth- Jagan: ప్రైమ్ టైమ్ లో డిబేట్ లతో బిజీగా ఉండే రజినీ కాంత్.. మొన్న కనిపించలేదు.. హఠాత్తుగా తాడేపల్లి ప్యాలెస్ లో ప్రత్యక్షమయ్యారని టీడీపీ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. ఏపీ సీఎం జగన్ తో రజినీకాంత్ భేటీ అయ్యారని గగ్గోలు పెడుతోంది. రహస్యంగా జరిగిన ఈ భేటి నిజమేనా? అబద్ధమా? అన్నది క్లారిటీ లేదు. ఓ మీడియా దిగ్గజ జర్నలిస్ట్ ఏకంగా సీఎంను కలిశాక వార్త బయటకు రాలేదంటే సమ్ థింగ్ రాంగ్. ఏదో జరుగుతోంది.. ఒకప్పుడు మీడియా అధిపతులు, పాత్రికేయులు రాజకీయ నాయకులను కలిసేందుకు అంతగా ఇష్టపడేవారు కాదు.. ఇప్పుడు పరిస్థితి మారింది. రాజకీయ నాయకులతో ఎంత అంట కాగితే అంత గొప్ప జర్నలిస్టులు అనే స్థాయికి పాత్రికేయం పడిపోయింది.. సరే అది వేరే చర్చ.. ఎన్ టీవీ తన ఫోల్డ్ లో ఉంది.. ఈ బలం సరిపోదు జగన్ కు. ఆ టీవీ 5, ఏబీఎన్ ఎలాగూ దారికి రావు. ఆ సాక్షి అతడికి ఎక్స్ ట్రా ఫింగర్ . ఉన్నది అంటే ఉన్నట్టు.. లేదు అంటే లేదన్నట్టు.. ఆ ఎల్లో మీడియాను టాకిల్ చేయలేదు. చేయబోదు. ఈ విషయం తెలిసే ఇటీవల ఓ సభలో తేల్చి పడేశాడు. అంతే కాదు దానిని గాలికి వదిలేశాడు. ఇన్నాళ్ళూ లేంది జగన్ రజినీ కాంత్ ను ఎందుకు పిలిచారు? అంత సుదీర్ఘంగా ఎందుకు భేటీ అయ్యారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది.

-లోకేష్ ను కొట్టేందుకేనా?
ఏపీలో పరిస్థితి అసలు బాగోలేదు.. ఇకపై బాగుంటుంది అనే నమ్మకం అక్కడి ప్రజలకు లేదు. ప్రభుత్వ నిధులు పంచుడు కార్యక్రమాలకే సరిపోతున్నాయి. ఉద్యోగులకు కనీసం సమయానికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు.. వారు ఏకంగా రాష్ట్ర గవర్నర్ నే కలిశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నేపథ్యంలో తానే తెలుగుదేశం పార్టీకి భావి రథసారధిని నిరూపించుకోవడం కోసం నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ క్రమంలో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.. సాధారణంగా తెలుగుదేశం పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంపై అంత ఎత్తున ఎగిసిపడే వైసిపి నాయకులు… ఈమధ్య ఎందుకో టాకిల్ చేయలేకపోతున్నారు. పైగా సొంత పార్టీలో నేతలే జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరుగుతున్నారు.. ఈ స్థితిలో ఎలాగైనా ప్రజల దృష్టి మరల కుండా ఉండేందుకు జగన్ టీవీ9 రజినీకాంత్ కు ఆహ్వానం అందించారని ప్రచారం సాగుతోంది.. ఆయన పిలిచిందే తడవుగా రజనీకాంత్ తాడేపల్లి వెళ్లి భేటీ అయ్యారని టీడీపీ మీడియా ఆరోపిస్తోంది.
-విషం చిమ్మాలనేనా?
పార్టీకో పేపర్, కులానికో చానెల్ ఉన్న తర్వాత సొంత ప్రయోజనాల కోసం మాత్రమే మీడియా అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇక ఎల్లో మీడియా, జగన్ మీడియా, పింక్ మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక లోకేష్ యాత్ర మొదలు పెట్టనున్న నేపథ్యంలో జనాల అటెన్షన్ మరల కుండా ఉండేందుకు జగన్ ఏకంగా తెలుగులో నంబర్ 2గా ఉంటున్న టీవీ9 శరణు జొచ్చారు. యువగళం కార్యక్రమానికి భారీగా కవరేజ్ వద్దని, నెగిటివ్ ప్రచారం ఎక్కువ చేయాలని కోరినట్టు ప్రచారం సాగుతోంది. పైగా ఇందుకు భారీగానే ముట్టచెప్పినట్టు టీడీపీ శ్రేణులు చెవులు కొర్రుక్కుంటున్నాయి. తెగ ప్రచారం చేస్తున్నాయి. రజనీ కాంత్ కూడా దీనికోసం ఒక టీం ను కూడా ఏర్పాటు చేసినట్టుగా చెబుతున్నారు.

-గతంలో కూడా ఇలాగే..
జగన్ కు టీవీ9 సహాయ పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అంతే 2019 లో జగన్ ను బాగా వెనకేసుకు వచ్చింది. రజినీ కాంత్ పలుమార్లు జగన్ ను ఇంటర్వ్యూ చేశారు. ఆయన పాదయాత్రకు బాగా కవరేజ్ ఇచ్చారు. ఇదే సమయంలో చంద్ర బాబు అతిని, తప్పిదాలను ప్ర(సా)చారం చేశారు. జనాలకు కూడా బాగా అర్థం అయింది. జగన్ వైపు దృష్టి మళ్ళింది. కానీ ఎంత తప్పు చేశారో వారికి ఇప్పుడు అర్థం అవుతున్నది. అన్నట్టు ఆ నంబర్ వన్ ఎన్టీ వీ తన ఫోల్డ్ లో ఉన్నాక జగన్ టీవీ 9 కు ఎందుకు ఆశ్రయించారు? నరేంద్ర చౌదరి ఆ లోకేష్ చౌదరికి బాసటగా నిలుస్తున్నారా?! ఈ విషయం తెలిసే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా? అయినా జగన్ పిచ్చి కాని మీడియాలో వచ్చే వార్తలు చూసి జనం ఓట్లు వేసే రోజులా ఇవి. మరీ ముఖ్యంగా “ఆకాశం లో నుంచి రుధిరం కురిపించే” టీవీ 9 ను జనం యాక్ థూ అంటున్నారు. అందుకే రెండో ర్యాంకు కు పడి పోయింది. ఇంకా మునుముందు చాలా ఉంది?! అలాంటి టీవీ9 వెంటపడడమే జగన్ చేస్తున్న తప్పు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే టీవీ9 రజినీకాంత్ జగన్ ను కలిశాడా? లేదా అన్న నిజనిజాలు కాలమే చెప్పాలి. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.