Dimple Hayati: అన్నీ ఉన్నా మరుగున పడిపోతున్న తెలుగు హీరోయిన్స్ లో డింపుల్ హయాతి ఒకరు. సెక్సీనెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉండే డింపుల్ హయాతికి బ్రేక్ రాలేదు. ఆమెకు దక్కిన అతి పెద్ద ఆఫర్ ఖిలాడి. రవితేజ హీరోగా విడుదలైన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఖిలాడి చిత్రంలో రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేసింది. అమాయకపు బ్రాహ్మణ అమ్మాయిగా అల్ట్రా స్టైలిష్ కన్నింగ్ లేడీగా నటించి అలరించారు. ఖిలాడి చిత్రం ఆడితే డింపుల్ కెరీర్ కి ప్లస్ అయ్యేది.

ఆమె బ్యాడ్ లక్ ఖిలాడి డిజాస్టర్ అయ్యింది. దర్శకుడితో హీరోకి ఏర్పడిన విబేధాలు కూడా చిత్ర పరాజయానికి కారణం. నేరుగానే రవితేజ, రమేష్ వర్మ విమర్శలు చేసుకున్నారు. ప్రస్తుతం డింపుల్ దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. రామబాణం టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. గోపీచంద్ హీరో. శ్రీవాస్-గోపీచంద్ లది హిట్ కాంబో. దర్శకుడిగా శ్రీవాస్ కెరీర్ మొదలైంది గోపీచంద్ మూవీతోనే. 2006లో విడుదలైన లక్ష్యం సూపర్ హిట్.
తర్వాత లౌక్యం టైటిల్ తో మరోసారి జత కట్టారు. అది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో రామబాణం సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రమైనా డింపుల్ హయాతికి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన డింపుల్ హయాతి మోడల్ గా కెరీర్ ప్రారంభించారు. గల్ఫ్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. అడపాదడపా చిత్రాలు చేసుకుంటున్న ఆమెకు గద్దలకొండ గణేష్ మూవీలో దర్శకుడు హరీష్ ఛాన్స్ ఇచ్చాడు.

గద్దలకొండ గణేష్ లో డింపుల్ హయాతి ఫస్ట్ టైం ఐటెం నంబర్ చేశారు. ‘జర్రా జర్రా” సాంగ్ లో మాస్ అండ్ హాట్ మూమెంట్స్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. సాలిడ్ అందాలు కలిగిన డింపుల్ హయాతికి రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా తనలోని పరువాల పవర్ చూపించే ప్రయత్నం చేస్తుంది. తాజాగా హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేశారు. ఇంస్టాగ్రామ్ లో డింపుల్ హయాతి షేర్ చేసిన బోల్డ్ ఫోటోలు రచ్చ చేస్తున్నాయి. ఆమె హాట్ నెస్ మైండ్ బ్లాక్ చేస్తుంది.