
SP Balu Dubai Sheik: దుబాయ్ షేక్(Dubai Sheik) లకు సాధారణంగా హిందీ అంతో ఇంతో మాట్లాడినా కష్టమైన మన దక్షిణాది భాషలు మాట్లాడాలంటే చెమటోడ్చాల్సిందే. ‘అరే మీకీ ఏం ఇచ్చింది.. మాకీ ఏం ఇచ్చిందిరా బై’ అంటూ మన బిగ్ బాస్ కంటెస్టెంట్ లోబో లాగా పదాలు కూనీ చేస్తుంటారు దుబాయ్ షేక్ లు.. దుబాయ్ నుంచి వచ్చిన వారు. కానీ ఒక దుబాయ్ షేక్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయి ఏలోకాన ఉన్నా ఆయన పాటలు మాత్రం ఇప్పటికీ మన చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. బాలు అమృతగానం పాటలు ఎన్నో వైరల్ అయ్యాయి. ఆయన పాట అంటే ప్రాణంగా భావించేవారు ఎందరో ఉన్నారు. ఎస్పీ బాలు పాడుతుంటే మంత్రముగ్దులై పోతారు.
తెలుగులోనే కాదు.. బాలు దక్షిణాది, హిందీలో కూడా ఫేమస్. ఎన్నో పాటలు పాడారు ఆయన. ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా చాలా మంది అభిమానులు ఎస్పీ బాలుకున్నారు. ఏ భాషలోనైనా పాటను అవలీలగా పాడేయగల నేర్పు ఎస్పీ బాలు సొంతం. ఎన్నో వేల పాటలతో ఆయన తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించారు. బాలు భౌతికంగా లేకపోయినా ఆయన పాడిన పాటలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఏ పాటకు అయినా బాలు ప్రాణం పోస్తారు.
కాగా ఒక బాలు పాడిన పాటకు ఓ దుబాయ్ షేక్ కూడా ఫిదా అయిపోయాడు. బాలు పాడిన పాటను అంతే లయబద్దంగా పాడి అలరించాడు. ఇదిప్పుడు టిక్ టాక్ లో వైరల్ గా మారింది. అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
1986లో తెలుగులో వచ్చిన సూపర్ హిట్ క్లాసికల్ మూవీ ‘సిరివెన్నెల’. ఈ మూవీలోని ‘విధాత తలపున వికసించినది’ అనే గీతం క్లాసిక్ లోనే గొప్ప ఆణిముత్యంలాంటిపాట.. ఈ పాటను ఏమాత్రం చెడగొట్టకుండా.. మన భాష రాకున్నా కూడా దుబాయ్ షేక్ పాడి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. దుబాయ్ షేక్ పాడిన పాట ఇప్పుడు టిక్ టాక్ సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. భాష రాకున్న దుబాయ్ షేక్ అద్భుతంగా పాడారంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు దీన్ని షేర్లు చేస్తున్నారు.