https://oktelugu.com/

Dubai: మీతో పిల్లల్ని కనాలంటే 2.5 కోట్లు ఇవ్వండి.. మిలియనీర్ కు ఆ కండీషన్ పెట్టిన భార్య

దుబాయ్‌కి చెందిన సౌదీ అనే మహిళ ఓ కోటీశ్వరుడిని వివాహం చేసుకుంది. లగ్జరీ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ వీడియో ద్వారా సోషల్‌ మీడియాలో పంచుకుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 7, 2024 / 09:18 AM IST

    Dubai

    Follow us on

    Dubai: స్త్రీ పరిపూర్ణతకు పెళ్లి సంతానం ప్రతీక. వివాహం అయిన ప్రతీ స్త్రీ తల్లి కావాలని భావిస్తుంది. మాతృత్వం మరో జన్మలాంటిది అని తెలిసిన తన జీవితం పరిపూర్ణం కావాలంటే తల్లి కావలని కలలు కంటుంది. ఈ ఘడియల కోసం వేచి చూస్తారు. పిల్లల కోసం పూజలు, వ్రతాలు చేస్తారు. ఇక ప్రెగ్నెన్సీ కన్ఫామ్‌ అయిన వెంటనే బిడ్డ పుట్టే వరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులతోపాటు, కుటుంబంలో అందరికీ పండుగ రోజే. అయితే ఈరోజుల్లో మారిన జీవనశైలి, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లతో సంతానానికి నోచుకోవడం లేదు. దీంతో ఆస్పత్రులతోపాటు గుళ్లు, గోపురాలు తిరుగతున్నారు. కడుపు పండాలని కనిపించిన దేవుడికి పూజలు చేస్తున్నారు. ఇంత కష్టతరమైన కాన్పును ఓ మహిళ వ్యాపారంగా మార్చుకుంది. ఈ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

    సౌదీ మహిళ..
    దుబాయ్‌కి చెందిన సౌదీ అనే మహిళ ఓ కోటీశ్వరుడిని వివాహం చేసుకుంది. లగ్జరీ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ వీడియో ద్వారా సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఇక తాజాగా తాను పిల్లలను కనేందుకు భర్త నుంచి భరణం డిమాండ్‌ చేసింది. ఈమేరక ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. తాను పిల్లలను కనాలంటే నెలకు రూ.2.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఈ డబ్బులతో ఖరీదైన బహుమతులు, ఖరీదైన హాలిడేలు, ప్రత్యేకమైన డెస్టినేషన్‌లకు సౌదీ టూర్లు ప్లాన్‌ చేస్తుందట. అందుకే తాను గర్భం దాల్చాలంటే రూ.50 లక్షల నుంచి రూ.55 లక్షల విలువైన కారు. హిర్మేస్‌ బిర్కిన్‌ హ్యాండ్‌ బ్యాగ్‌ వంటివి కొనాలని డిమాండ్‌ చేసిందట.

    ప్రతీ బిడ్డకు రూ.2 కోట్లు..
    ఇక తనకు పుట్టబోయే ప్రతీ బిడ్డకు
    ప్రతి బిడ్డకు దాదాపు రూ. 2 కోట్ల భత్యం కావాలంటుందట. పుట్టబోయే పిల్లల జెండర్‌కి అనుగుణంగా పలురంగాలతో కూడిన డైమండ్‌ రింగ్, డిజైనర్‌ హ్యాండ్‌బ్యాగ్‌ వంటి విలాసవంతమైన వస్తువులను డిమాండ్‌ చేస్తుందట. ఇక ఎంత మంది పిల్లలు కావాలన్నా ప్రతీ ప్రసవానికి రేటును సౌదీ నిర్ణయించిందట. ఇప్పటికే విలువైన కార్లు కొనుగోలు చేసిందట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు బిడ్డను కనడానికి డబ్బులు డిమాండ్‌ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరు దుబాయ్‌లో ఇవన్నీ కామన్‌ అని కామెంట్లు పెడుతున్నారు.