Cow Dung: భారత్ లోని ఆవుపేడను ఎగబడి కొంటున్న దుబాయ్, అరబ్ దేశాలు.. కారణమేంటంటే?

భారత దేశంలోని ఆవు పేడను దుబాయ్, అరబ్‌ దేశాలు ఎక్కువగా కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ నుంచి పెద్ద మొత్తంలో ఆవుపేడను ఎగుమతి చేస్తున్నాం. ఇందులో ఏముందో తెలియదు కానీ, పడవల్లో టన్నుల కొద్ది ఆవుపేడను తరలించుకుపోతున్నారు.

Written By: Raj Shekar, Updated On : February 27, 2024 12:38 pm
Follow us on

Cow Dung: ఆవు.. మన సాదుజంతువు. హిందువులు పవిత్రంగా, దేవతగా కొలిచేది ఆవునే. భారతీయులతో ఆవుకు ఉన్న అనుంబంధం వేరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆవుల కోసం పండుగలు, పర్వదినాల్లో ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తారు. ఇక రైతులతో ఆవులు, ఎద్దులు కలిసి జీవిస్తాయి. ఇప్పుడు ఫాం కల్చర్‌ వచ్చాక పట్టణాల్లో సైతం గోవుల పెంపకాలు, గోశాలల్లో గోవుల సంరక్షణ చర్యలు చేపడుతున్నాయి. ఇక మన ఆవు పేడదే దేశీయంగా పిడకలతోపాటు, తాజాగా అగర్‌బత్తులు, వినాయక విగ్రహాలు, అనేక ఇతర ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. గోవు మూత్రాన్ని ఔషదంగా వాడుతున్నారు. అయితే, మన ఆవు పేడకు విదేశాల్లోనూ డిమాండ్‌ పెరుగుతోంది.

దుబాయ్, అరబ్‌ దేశాలకు ఎగుమతి..
భారత దేశంలోని ఆవు పేడను దుబాయ్, అరబ్‌ దేశాలు ఎక్కువగా కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ నుంచి పెద్ద మొత్తంలో ఆవుపేడను ఎగుమతి చేస్తున్నాం. ఇందులో ఏముందో తెలియదు కానీ, పడవల్లో టన్నుల కొద్ది ఆవుపేడను తరలించుకుపోతున్నారు. తాజాగా కువైట్‌ ఇండియా నుంచి 192 మెట్రిక్‌ టన్నుల ఆవు పేడకు ఆర్డర్‌ ఇచ్చింది. వాళ్లు ఆ ఆర్డర్‌ను కూడా రిసీజ్‌ చేసుకుంది.

ఏం చేస్తారో తెలుసా..
అరబ్‌ దేశాలు అంటేనే ఎడారి దేశాలు అక్కడ ఎలాంటి పంటలు పండవు. మన దేశంలో అయితే ఆవు పేడను పంటలకు ఎరువులుగా వేస్తారు. మరి అరబ్‌ దేశాల్లో ఏం చేస్తారు అన్న సందేహా వ్యక్తమయ్యాయి. అయితే వాళ్లు ఇంత భారీగా ఆవు పేడ దిగుమతి చేసుకోవడానికి కారణం ఉందట. ఇటీవల కువైట్‌ శాస్త్రవేత్తలు ఆవుపేడపై పరిశోధన చేశారట. ఖర్జూర సాగుకు అవసరమైన పోషకాలు భారతదేశ ఆవుపేడలో పుష్కలంగా ఉన్నట్లు గుర్తించారు. గల్ఫ్‌ దేశాలు పండించే ఖర్జూరకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. ఎడారిలో పండించే ఖర్చూరా మొక్కలకు ఆవుపేడ వేస్తే దిగుబడి పెరుగుతుందని పరిశోధనలో గుర్తించారు. ఆవు పేడలో ఔషధ గుణాలు, పంటలకు మేలు చేసే పోషకాలు ఉంటాయి.

మనవాళ్లు గుర్తించడం లేదు..
ఇక బయటి దేశం వాళ్లు మన ఆవుపేడను టన్నుల కొద్దీ దిగుమతి చేసుకుంటుంటే.. మన భారతీయులు మాత్రం దానిని ఇంకా చీపీగానే చూస్తున్నారు. దాని విలువను గుర్తించడం లేదు. మరి ఈ వార్తతో అయినా మన భారతీయ సంప్రదాయం, ఆవు విలువ తెలుసుకోవాలని ఆశిద్దాం.