Dream Job: మనిషి అవకాశాలు సృష్టించుకోవాలి. కానీ పని లేదని చూస్తూ చేతులు ముడుచుకోకూడదు. నీ అదృష్టాన్ని మార్చేవి నీ చేతిలో ఉండే గీతలు కాదు చేతలే అని గుర్తుంచుకోవాలి. చీకటిలో కూర్చుని తిట్టుకునేకంటే ఆ చీకటిలోనే ఓ చిరుదీపం వెలిగించడం మంచిది చైనా సామెత. పని చేసి పదిమందిని సాకితే ఇగురంతోని ఇరవై మందిని సాకాడట. తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదమ్మ తోటకూర సుబ్బమ్మా అన్నట్లు ప్రతి వ్యక్తి మెదడు బరువు 1350 గ్రాములే. అది ఉపయోగించుకునే తీరును బట్టి అది మనకు ఉపయోగపడుతుంది. అందుకే సరిగ్గా మెదడు పెట్టి ఆలోచిస్తే ఈ లోకంలో పనులు ఎన్నో ఉన్నాయి. నాకు పని లేదన్నాడంటే అతడికి మెదడు లేదని తెలిసిపోతుంది.

జపాన్ లోని షోజీ మోరిమోటో ఓ వినూత్నంగా ఆలోచించాడు. ఏ పని చేయకుండానే రూ.22.4 కోట్లు సంపాదించాడు. నిజంగా నిజమే. కానీ ఎవరు నమ్మరు. అతడు చేసిన పని ఏమీ లేదు. డబ్బులు మాత్రం సంపాదించాడు. అదే అతడి తెలివితేటలు. నాలుగేళ్లలో నాలుగు వేల సెషన్స్ చేసి ఈ డబ్బు సంపాదించడం గమనార్హం. లోకంలో రకరకాల వ్యక్తులుంటారు. వారి బుర్రల్లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కొందరు వాటిని అమలు చేస్తారు. కొందరు మాత్రం అలా ఆలోచించుకుంటూ ఉండిపోవడం తెలిసిందే.
ఇతడు మాత్రం ఆలోచలను ఆచరణ రూపం కల్పించాడు. ఒంటరిగా ఉండే వాళ్లకు తోడుగా ఉండేందుకు వెళ్లి అక్కడ ఏ పని చేయడు. కానీ వారి వెంట మాత్రం ఉంటాడు. దీనికి గాను ఒక్కో వ్యక్తి దగ్గర రూ. 10 వేల యెన్ లు సుమారు మన దేశ కరెన్సీలో ఐదు వేలు తీసుకుంటుంటాడు. ఇలా నాలుగేళ్లలో అతడు రూ. 22 కోట్లు సంపాదించడం అంటే మాటలు కాదు. అతడి ప్రతిభకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. పైగా పనులు కూడా చేయడు. కేవలం తోడుగా మాత్రమే ఉంటాడు. అన్ని పనులు వారే చూసుకోవాలి.

తెలివిని ఇలా ఉపయోగించుకుని అతడు తన సంపాదన పెంచుకోవడం విశేషం. మనం పని చేస్తానంటేనే పైసా కూడా ఇవ్వడం లేదు. కానీ అతడు పని చేయకుండానే ఇంత డబ్బు సంపాదించడం నిజంగా గర్వకారణమే. అందుకే బుర్రున్నోడికి బువ్వకు లోటుండదని చెబుతుంటారు. ఇప్పుడు దీన్ని నిజం చేసి అతడు మనల్ని కూడా ఆలోచించుకోవాలని సవాలు చేసినట్లు అయింది. లోకంలో ఇలాంటి వారు కూడా ఉంటారు. జాగ్రత్త మన మెదడును సరైన రీతిలో వాడుకుని మనం కూడా డబ్బు సంపాదించుకోవచ్చని తెలుస్తోంది.
Also Read:Nayanthara: నయనతార పిల్లల్ని కంటే చనిపోతుంది.. కారణం అదే.. షాక్ అవుతున్న ఫ్యాన్స్ !
[…] Also Read: Dream Job: ఏ పని చేయకుండానే అంత సంపాదనా?.. తెల… […]