TV Offers: ఏదైనా వస్తువును కొనుగోలు చేయించేందుకు వ్యాపార సంస్థలు డిస్కౌంట్లు, బైవన్ గెట్‌వన్, ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్లు, పండుగ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తుంటాయి. ఈ ఆఫర్లను చూసి మనం వానికి కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది. అంతేకాదు.. షాప్‌కు వెళ్లగానే ఎంత డిస్కౌంట్ ఇస్తారు, ఆఫర్లు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నాం. ఇది కొనుగోలుదారుని వీక్‌నెస్‌గా మారిపోయింది. ఇప్పుడు దీనినే టీవీ షోరూంల నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు, తమ ప్రొడక్ట్‌ను అమ్మేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇందులో డౌన్ సెల్లింగ్ స్ట్రాటజీ ఒకటి.
ఏంటి ఈ డౌన్ సెల్లింగ్ స్ట్రాటజీ ఒకటి?
డౌన్ సెల్లింగ్ స్ట్రాటజీ.. ఇప్పుడు పెద్దపెద్ద షోరూం నిర్వాహకులు అనుసరిస్తున్నారు. తమ షాప్‌కు వచ్చే కస్టమర్లు వస్తువు కొనుగోలు చేసే వెళ్లేలా ఈ స్ట్రాటజీ పనిచేస్తుంది. పనిలో పనిగా వస్తువు అమ్మకం జరుగుతుంది. మంచి లాభం కూడా వస్తుంది. దీంతో ఇప్పుడు అందరూ ఈ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు. ఇది ఎలా అంటే.. ముందుకు కస్టమర్ తమ షోరూంకు రాగానే, మంచి క్వాలిటీ ఉన్న టీవీలను చూపుతున్నారు. ఈ సందర్భంగా కస్టమర్ బడ్జెట్ గురించి అడగగానే… ధర చెబుతున్నారు. ఆ తర్వాత ఆయన బడ్జెట్ ఎంతో తెలుసుకుంటున్నారు. ఇక్కడే మోసానికి తెరలేపుతున్నారు. బడ్జెట్‌లో ఉన్న వస్తువును చూపకుండా, అదే క్వాలిటీ అంటూ తక్కువ పరిమాణం, తక్కువ సైజ్ ఉన్నవాటిని చూపుతున్నారు. దానికి కస్టమర్ ఓకే అనేలా ఒప్పిస్తున్నారు. అక్కడ కూడా ఓకే అనకపోతే.. డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉందని, ఆఫర్ ఒకరోజు మాత్రమే అంటూ నమ్మిస్తున్నారు. దీంతో కస్టమర్ కాంప్రమైజ్ అయిపోతున్నారు. దీనినే డౌన్ సెల్లింగ్ స్ట్రాటజీ అంటారు.
బడ్జెట్‌లో ప్రొడక్ట్ ఉన్నా..
వినియోదారుడు అడిగిన బడ్జెట్‌లో సదరు షాప్‌లో ప్రొడక్ట్ ఉన్నా.. దానిని కాకుండా, ఎక్కువ ప్రైజ్ ఉన్న వస్తువును చూపి, దానిని కస్టమర్‌కు అమ్మడం చేస్తున్నారు. తద్వారా సదరు షాప్‌కు లాభం రావడమే కాకుండా, ప్రొడక్ట్ అమ్ముడవుతోంది. ఇలా కొత్త కొత్త స్ట్రాటజీలతో వ్యాపారులు తమ వస్తువులను అమ్ముతున్నారు. అయితే ఇక్కడ నష్టపోయేది మాత్రం కొనుగోలుదారులే అనేది గుర్తించడం లేదు. తక్కువ ధరకు వచ్చిందని మాత్రమే ఆలోచిస్తున్నారు.
View this post on Instagram