Salaar: ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తమదైన చిత్రాలను నిర్మించే ప్రొడక్షన్ హౌస్ లలో ‘హోంబలే ఫిలిమ్స్’ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే ఈ బ్యానర్ నుంచి వచ్చిన చాలా సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో తమ సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఈ క్రమంలోనే తమదైన రీతిలో సినిమాలు నిర్మిస్తు ఈ బ్యానర్ సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తుంది..ఇక హోంబలే ఫిలిమ్స్ కి ఆ పేరెలా పెట్టారు. బిజినెస్ చేసుకునే వాళ్ళకి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కర్ణాటక కి చెందిన విజయ్ కిరంగ దూర్, చలువ గౌడ,కార్తిక్ గౌడ లకు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళని ప్రొడ్యూసర్లుగా మార్చింది. ఇతర వృత్తుల్లో స్థిరపడ్డ వాళ్ళు కేవలం సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ ని ఏదో ఒక రకంగా చూపించుకోవాలనే ఉద్దేశ్యం లో భాగంగా వాళ్ళు ప్రొడ్యూసర్లు గా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక 2013 లో హోంబలే బ్యానర్ ని స్థాపించి సినిమాలు చేస్తున్నారు. దీనికి వాళ్ల ఇల వేల్పు అయిన హాంబలమ్మ పేరు మీద హొంబలే ఫిల్మ్స్ అనే పేరు పెట్టారు…
ఇక వీళ్ళు పునీత్ రాజ్ కుమార్ తో మొదటి ప్రయత్నం గా చేసిన నిన్నిందలే అనే సినిమా ప్లాప్ అయ్యింది. అయినప్పటికి వాళ్ళు ఎక్కడ కూడా నిరుత్సాహ పడకుండా మనం డైరెక్ట్ గా సినిమా ప్రొడ్యూసర్లు గా ఎంటర్ అయ్యాం కాబట్టి మనకు సినిమా స్క్రిప్ట్ మీద గ్రిప్ లేదు అని వాళ్ళకి వాళ్లే అనుకొని ఒక మంచి స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకొని సినిమా చేయాలని యశ్ ని హీరో గా పెట్టీ చేసిన మాస్టర్ పీస్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది…ఇక ఈసినిమా 35 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది ఇక తర్వాత మళ్ళీ పునీత్ రాజ్ కుమార్ తో చేసిన రాజకుమార సినిమా సక్సెస్ అవడంతో పాటుగా 76 కోట్ల వరకు కలక్షన్లను రాబట్టింది అలాగే మల్టీ ఫ్లెక్స్ లలో 6 వారాల్లో 6000 సార్లు ప్రదర్శించబడిన ఏకైక కన్నడ సినిమాగా ఈ సినిమా రికార్డు సృష్టించింది…
ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేద్దామనే ఉద్దేశంతోనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ ని హీరోగా పెట్టీ కేజిఎఫ్ అనే సినిమాకి శ్రీకారం చుట్టారు. ఇక ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా 80 కోట్ల తో తీసిన ఈ సినిమా 250 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇక కే జి ఎఫ్ సెకండ్ పార్ట్ అయితే 1200 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక దాంతో పాటుగా మధ్యలో కాంతారా అనే సినిమా చేశారు. అయితే ఇది మొదట కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం చేయాలనే ఉద్దేశ్యం తో చిన్న సినిమాగా చేసినప్పటికీ అది మంచి హిట్ అవ్వడం తో పాన్ ఇండియా రేంజ్ లో దాన్ని డబ్ చేసి రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా ఇండియా వైడ్ గా మొత్తం 330 కోట్ల కలక్షన్ల ను రాబట్టింది…ఇక ఇప్పుడు సలార్ సినిమాతో మరోసారి తమ సత్తా చాటుకుంటున్నారు ఇప్పటికే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కూడా వెయ్యి కోట్లకు పైన కలక్షన్లను రాబడుతుందనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ఒక పక్క పెద్ద సినిమాలు చేస్తూనే మధ్యలో చిన్న చిన్న సినిమాలను కూడా చేస్తున్నారు ఇప్పుడు వీళ్ల అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి
యువ, భగీర, కాంతర చాప్టర్ 1,ఆర్చర్డ్ ఆంటోనీ (కన్నడ),రఘు తాత( తమిళ్),టైసన్ (మలయాళం)… వేరే భాషల్లో కూడా సినిమాలు చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు…