Rocking Rakesh- Rashmi: బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా కొనసాగుతూ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో ముందు వరుసలో ఉంటుంది రష్మీ..జబర్దస్త్ లోకి రాకముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకునే రష్మీ ఈ జబర్దస్త్ షో ద్వారా ఏ రేంజ్ పాపులారిటీ ని తెచ్చుకుందో అందరికీ తెలిసిందే..ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీ తో ఆమె సినిమాల్లో హీరోయిన్ గా చేసే రేంజ్ కి ఎదిగింది.

ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ తెరకెక్కిన ‘గుంటూరు టాకీస్’ అనే చిత్రం అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది కానీ, అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు..ప్రస్తుతం ఆమె ఈటీవీ లో ఎక్స్ట్రా జబర్దస్త్ మరియు శ్రీ దేవి డ్రామా కంపెనీ షోస్ కి యాంకర్ గా చేస్తుంది..ఈ షోస్ తో పాటుగా పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటిస్తుంది రష్మీ.
జబర్దస్త్ షో లో రష్మీ మీద కమెడియన్స్ జోక్స్ వెయ్యడం సర్వసాధారణం..ఇన్ని ఏళ్ళ యాంకర్ కెరీర్ లో రష్మీ ఏనాడు కూడా తన పైన వేసిన జోక్స్ ని సీరియస్ గా తీసుకోలేదు..అయితే ఇప్పుడు లేటెస్ట్ గా కమెడియన్ రాకేష్ తన స్కిట్ లో రష్మీ మీద వేసిన ఒక పంచ్ కి ఆమె కొద్దిగా హర్ట్ అయ్యినట్టు తెలుస్తుంది..స్కిట్ లో భాగం గా రాకేష్ దొంగ స్వామీజీ వేషం వేస్తాడు..ఈ స్కిట్ లో తనతో పాటు ఉన్న మరో కమెడియన్ ప్రవీణ్ యాంకర్ రష్మీ జాతకం ఎలా ఉందొ చెప్పండి గురూజీ అని అడుగుతాడు..అప్పుడు రాకేష్ దానికి సమాధానం చెప్తూ ‘అందరూ డబ్బులు లేవని గుండెలు బాదుకుని ఏడుస్తుంటారు.

కానీ రష్మీ గుండెలు బాదుకుంటూ గున్న గున్న మామిడి అనే సాంగ్ చేస్తూ గుండెలు బాదుకుంటూ చేతినిండా డబ్బులు సంపాదిస్తుంది’ అని అంటాడు..దానికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..అయితే ఈ ప్రోమో చూసి సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ రష్మీ పై అసభ్యంగా ట్రోల్ వెయ్యడం దానికి రష్మీ చాలా సీరియస్ రియాక్షన్ ఇచ్చింది.