
Pooja Bharti: ఒకప్పుడు సినిమాల్లో అలరించిన నటీమణుల్లో చాలా మంది ఇప్పుడు కనిపించకుండా పోయారు. కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న చాలా మంది పెల్లిళ్లు చేసుకొని ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అయ్యారు. సోషల్ మీడియాపై ఇంట్రెస్టు ఉన్నవారు అప్పుడప్పుుడు తమ పిక్స్ ను షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఓ బ్యూటీ ఫొటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అలనాడు ఓ బ్లాక్ బస్టర్ మూవీలో నటించిన ఈమె ప్రస్తుతం స్లిమ్ అయి కనిపిస్తోంది. సినిమాల్లో నటించినంతకాలం అందచందాలతో అలరించిన వారు.. ఆ తరువాత లావై కనిపిస్తారు. కానీ ఈమె మాత్రం ఇలా అందంగా మారడంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో మీరే చూడండి.
కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ‘ఖడ్గం’ మూవీని చూడని వారుండరు. అన్ని రకాల ఎమోషన్స్ కలిగిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, బ్రహ్మజీలతో పాటు ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో పోషించారు. ఈ సినిమాలో ఎవరు ప్రముఖ హీరో అని కాకుండా ప్రతి ఒక్కరూ తమ నట విశ్వరూపాన్ని చూపించారు. చివరికి కమెడియన్ పృథ్వీరాజ్ సైతం ‘30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ’ అనే డైలాగ్స్ తో పాపులర్ అయ్యారు. హీరోలతో పాటు నటీమణులు సోనాలి బింద్రే తదితరులు చక్కగా నటించారు. వారి పాత్రలకు న్యాయం చేసి ఆకట్టుకున్నారు.
ఇందులో ప్రకాశ్ రాజ్ భార్యగా ఒకామె నటించింది. ఆమె పేరు పూజా భారతి. పూజా భారతి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఆమె ఫేస్ చూస్తే మాత్రం కచ్చితంగా గుర్తుపడుతారు. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కృష్ణవంశీ ఆమెకు అవకాశం ఇచ్చాడు. మొదటి సీనిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. ఆ తరువాత పూజా భారతి హీరోయిన్ గా కాకపోయినా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ఆకట్టుకున్నారు. అయితే ఆ తరువాత అవకాశాలు లేకపోవడతో కనుమరుగైపోయారు.

అయితే ఆమె లేటేస్టు పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సాధారణంగా హీరోయిన్స్ సినిమాలు మానేశాక లావవుతారు. కానీ పూజా భారతి మాత్రం స్లిమ్ గా తయారయ్యారు. అప్పటి కంటే ఇప్పుడే ఆమె అందంగా ఉన్నారని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ భామ ఇలా మారడానికి కారణం సినిమాల కోసమేనా? అని కొందరు అంటున్నారు. ఏదీ ఏమైనా పూజా భారతి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.