Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాహుబలితో తన స్టామినా ఏంటో నిరూపించాడు. ఖండాంతర ఖ్యాతి గడించాడు. రెబల్ స్టార్ కృష్టం రాజు వారసుడిగా ఈశ్వర్ తో రంగ ప్రవేశం చేసిన ఆయన సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ తనకు ఎదురు లేదని చెప్పకనే చెప్పాడు. ఒక్కో సినిమాకు ఒక్కో స్టైల్ లో తన సినిమాల్లో తనదైన శైలిలో నటించారు. ప్రభాస్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. బాహుబలి తరువాత సాహో, రాధేశ్యాం నిరుత్సాహపరిచినా రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు.
Prabhas
ప్రభాస్ కు చేతినిండా సినిమాలు ఉన్నా తాజాగా ఓ బ్యాంకు నుంచి రూ.21 కోట్ల అప్పు చేశారనే వార్త సంచలనం కలిగిస్తోంది. నేషనల్ బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారనే విషయం ఆశ్చర్యపరుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న సొంతింటిని తనఖా పెట్టి బ్యాంకులో అప్పు తీసుకున్నట్లు వస్తున్న వార్తలు ఆలోచనలు పెంచుతున్నాయి. ప్రభాస్ కు అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషికం తీసుకుంటున్న ప్రభాస్ కు అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు వస్తున్నాయి.
అయితే ప్రభాస్ పేరిట కొన్న ఓ ఖరీదైన స్థలం కబ్జా కాకుండే ఉండేందుకే ప్రభాస్ దానిని ష్యూరిటీగా బ్యాంకులో పెట్టి అప్పు చేసినట్లు చర్చించుకుంటున్నారు. అయితే ఇందులో నిజం ఉందా లేదా పుకారా అని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రెబల్ స్టార్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నారు. రెండు ప్రాజెక్టులు భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వచ్చే ఏడాది ప్రభాస్ ప్రభంజనం సృష్టిస్తారని అందరు ఆశిస్తున్నారు. ఇప్పటివరకు రెండు ఫెయిల్యుర్స్ తో ఉన్న ప్రభాస్ కు 2023 మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు.
Prabhas
రెండు సినిమాలు చేస్తూనే మారుతి డైరెక్షన్ లో మరో సినిమా పూర్తి చేస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నిరంతరంగా కొనసాగుతోంది. దీనికి రాజా డీలక్స్ అనే పేరు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభాస్ కు వచ్చే ఏడాది మంచి హిట్లు అందించడం ఖాయమనే అభిమానులు ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో కచ్చితంగా హిట్లు రావడం పైనే ఆశలు పెట్టుకున్నారు. మొత్తానికి ప్రభాస్ కు రానున్న రోజులు మంచి ఫలితాలు ఇస్తాయనే కోరుకుంటున్నారు.