Friendship Day 2022: వందమంది స్నేహితులుండటం గొప్పకాదు. వంద సమస్యలు తీర్చే స్నేహితుడు ఉండటం గొప్ప అన్నారు. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్నారో సినీకవి. ఈ సృష్టిలో స్నేహంకంటే గొప్పది ఏదీ లేదని తెలిసిందే. నువ్వెలాంటివో తెలియాలంటే నీ స్నేహితులెవరో చెప్పు అని అడుగుతారు. స్నేహంలో ఎలాంటి అరమరికలు ఉండవు. స్వార్థం ఉండదు. అన్ని విషయాలు కుటుంబసభ్యులతో చెప్పుకోలేం. స్నేహితులతో మాత్రం అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. అందుకే మన స్నేహితులే మన హితులుగా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. దీంతో స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడరని తెలిసిందే.

స్నేహితుల దినోత్సవాన్ని రెండు రోజులు జరుపుకోవడం తెలిసిందే. జులై 30న కూడా జరుపుకుంటారు. అంతర్జాతీయంగా స్నేహితుల దినోత్సవాన్ని జులై 30, 1958 లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జులై 30న జరుపుకుంటారు. కొన్ని దేశాల్లో ఆగస్టు 7న కూడా జరుపుకోవడం తెలిసిందే. దీంతో స్నేహితుల దినోత్సవాన్ని రెండు రోజులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 1958లో పరాగ్వేలో తొలిసారిగా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుని దాన్ని విశ్వవ్యాప్తం చేశారు.
Also Read: Chandrababu Meets Modi: మోదీని కలవడం వెనుక చంద్రబాబు అసలు వ్యూహం ఇదేనా..?
అమెరికాకు చెందిన జాయిస్ హాల్ అనే వ్యాపారి మొదటిసారి 1930లో ఫ్రెండ్ షిప్ డే ప్రతిపాదన తెచ్చినట్లు తెలుస్తోంది. గ్రీటింగ్ కార్డులు అమ్ముకోవచ్చనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రతిపాదన చేసినట్లు అనుమానించి అతడి ప్రతిపాదనను ఎవరు విశ్వసించలేదు. జూలై 30న నిర్వహించుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించింది. దీంతో 2011నుంచి జులై 30న స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీంతో స్నేహితుల దినోత్సవాన్ని జులై 30న జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

భారతదేశంలో స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు 7నే జరుపుకుంటారు. స్నేహితులకు కూడా ఎంతో విలువ ఇస్తారు. ఫ్రెండ్స్ కోసం త్యాగాలు చేసిన వారు ఉన్నారు. కడదాకా తోడుండే వారు ఉన్నారు. స్నేహితుల కోసమే తమ సర్వస్వాన్ని పోగొట్టుకున్న వారు కూడా ఉండటం తెలిసిందే. భారతదేశం, బంగ్లాదేశ్, యూఏఈ, మలేషియా, యూఎస్ ఏలో కూడా ఇవాళే స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం విధితమే. జులై 30న నేపాల్ లో, ఏప్రిల్ 9న బెర్లిన్, ఒర్యాలియో, ఒహియోలలో జరుపుకుంటున్నారు. అర్జెంటీనా, మెక్సికోలో జులై 14న జరుపుకుంటారు. బ్రెజిల్ లో జులై 20న జరుపుకోవడం తెలిసిందే.
స్నేహితుల దినోత్సవాన్ని కుల, మతాలకు అతీతంగా జరుపుకుంటారు. స్నేహానికి హద్దులు లేవు. ప్రపంచమంతా స్నేహితులుండొచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఖండాంతరాలు దాటిన ప్రేమలు ఉన్నాయి. స్నేహాలు కూడా వర్ధిల్లాయి. దీంతో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగ నిర్వహించుకుంటారు. ఇందులో ఆడ, మగ తేడాలు కూడా ఉండవు. స్నేహితులంటే ఆడైనా మగైనా ఒకే ప్రాధాన్యం ఇస్తుంటారు. స్నేహమంటే ఇదేరా అనే ధోరణిలో ఫ్రెండ్ షిప్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నారు.
Also Read:PM Modi- Chandrababu: చంద్రబాబుపై మోడీ ప్రేమ పొంగిపాయే.. పచ్చ మీడియా కళ్లు చల్లబడే.!