
Chandramukhi Movie: గతం లో సూపర్ స్టార్ రజినీకాంత్ చిరంజీవి సినిమాలను చాలానే రీమేక్ చేసాడు.బాషా వరకు ఇద్దరు ఒకే రేంజ్ స్టార్ స్టేటస్ తో ఉండేవాళ్ళు కానీ, బాషా తర్వాత రజినీకాంత్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.ముఖ్యంగా తెలుగు లో ఆయన మార్కెట్ మన స్టార్ హీరోల రేంజ్ కి ఎగబాకింది.ఇక ఓవర్సీస్ లో కూడా ఆయన మార్కెట్ ఒకటికి పదింతలు అయ్యింది, తిరుగులేని సూపర్ స్టార్ ని చేసింది.
ఆంటీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తొలుత చిరంజీవి చెయ్యాల్సిందట, కానీ కొన్ని అనుకోని పరిస్థితుల కారణం గా ఆ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది.ఇప్పుడు లేటెస్ట్ గా బయటపడిన వార్త ఏమిటంటే, చిరంజీవి చెయ్యాల్సిన మరో సినిమా రజినీకాంత్ చేతుల్లోకి వెళ్లి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందట.ఆ చిత్రం మరేదో కాదు, చంద్రముఖి అట.ఈ సినిమా సౌత్ లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే.
మలయాళం లో సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న సురేష్ గోపి హీరో గా ఆరోజుల్లో మణిరత్న మహాల్ అనే సినిమా వచ్చింది.శోభన ఇందులో హీరోయిన్ గా నటించింది,1993 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.ఆ తర్వాత ఈ సినిమాని కన్నడలో ఆప్తమిత్ర అనే పేరు తో విష్ణు వర్ధన్ ని పెట్టి రీమేక్ చేసారు.అక్కడ కూడా పెద్ద సూపర్ హిట్ అయ్యింది.ఈ చిత్రం లో సౌందర్య హీరోయిన్ గా నటించింది.అలా ఈ రెండు బాషలలో సూపర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు VN ఆదిత్య చిరంజీవి తో చెయ్యాలని అనుకున్నాడట.

వెంటనే ‘ఆప్తమిత్ర’ సినిమాని చూడాల్సిందిగా చిరంజీవి కి చెప్పాడట.ఆ సినిమాని చూసిన చిరంజీవి ఎందుకో తన ఇమేజి కి సూట్ కాదని రిజెక్ట్ చేసాడట.దాంతో ఈ రీమేక్ రైట్స్ ని తమిళ హీరో ప్రభు సొంతం చేసుకొని, రజినీకాంత్ ని హీరో గా పెట్టి తీశారు.ఫలితం ఎలాంటిదో అందరికీ తెలిసిందే,అలా చేతులారా చిరంజీవి ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని మిస్ చేసుకున్నాడు.