Chanti Movie: ‘చంటి’ని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Chanti Movie: సినిమా షూటింగ్ సమయంలో అనూహ్య మార్పులు జరుగుతుంటాయి. అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమా షూటింగ్ పూర్తి కాకపోడం.. అనుకున్న తేదీ విడుదల కాకపోవడం.. లాంటివి చూస్తుంటాం. అలాగే అనుకున్న నటులు కూడా సమయానికి ఒప్పుకోకపోవడంతో వారి స్థానాల్లో ఇతరులకు అవకాశం ఇస్తూ ఉంటారు. అయితే కొంత మంది స్టోరీ నచ్చకో.. లేదా ఇతర కారణాల వల్లో సినిమాలో నటించడానికి ముందుకు రారు. కానీ ఆదే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు అయితే నాలుక కరుచుకుంటారు. […]

Written By: Chai Muchhata, Updated On : April 19, 2023 3:55 pm
Follow us on

Chanti Movie

Chanti Movie: సినిమా షూటింగ్ సమయంలో అనూహ్య మార్పులు జరుగుతుంటాయి. అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమా షూటింగ్ పూర్తి కాకపోడం.. అనుకున్న తేదీ విడుదల కాకపోవడం.. లాంటివి చూస్తుంటాం. అలాగే అనుకున్న నటులు కూడా సమయానికి ఒప్పుకోకపోవడంతో వారి స్థానాల్లో ఇతరులకు అవకాశం ఇస్తూ ఉంటారు. అయితే కొంత మంది స్టోరీ నచ్చకో.. లేదా ఇతర కారణాల వల్లో సినిమాలో నటించడానికి ముందుకు రారు. కానీ ఆదే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు అయితే నాలుక కరుచుకుంటారు. అలా ఓ స్టార్ నటి చంటి సినిమాను మిస్ చేసుకుంది. ఆమె ఎవరో చూద్దాం.

విక్టరీ వెంకటేష్ కెరీర్లో అద్భుత చిత్రం ‘చంటి’. అమాయక చక్రవర్తిలా ఇందులో వెంకీ చాలా బాగా నటించారు. అప్పటి వరకు సాధారణ హీరోగా ఉన్న వెంకీ ఈ సినిమాతో స్టార్ డం దక్కింది. రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో వచ్చిన ఇందులో వెంకటేష్ తో పాటు మీనా, నాజర్, సుజాత తదితరులు నటించారు. అమాయకుడైన చంటి, రాజభవన్లో ఉండే అమ్మాయి మధ్య ప్రేమ చిగురించడం.. ఆ తరువాత అమ్మాయి అన్నదమ్మలు రిజెక్ట్ చేయడం వంటి సీన్స్ పెట్టారు. చివరికి ప్రేమే గెలుస్తుందనేది సినిమా కథాంశం.

 

ఇందులో హీరోయిన్ మీనా జీవించిందనే చెప్పొచ్చు. మీనా అప్పటికే కొన్ని సక్సెస్ సినిమాల్లో నటించినా ఈ సినిమాతో పూర్తిస్థాయి నటిగా పేరు తెచ్చుకున్నారు. ‘చంటి’ని ముందుగానే తమిళంలో ‘చిన్న తంబి’ పేరుతో తీశారు. ఇందులో ప్రభు, కుష్బూ నటించారు. అక్కడ సక్సెస్ అయిన తరువాత తెలుగులో రీమేక్ చేశారు. అయితే తమిళ్ లో కంటే తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Kushboo

తమిళంలో హీరోయిన్ గా నటించిన కుష్బునూ తెలుగులో కూడా నటించాలని డైరెక్టర్ కోరారట. అయితే అప్పటికే కుష్బూ బిజీ హీరోయిన్ గా మారారు. దీంతో డేట్స్ అడ్జెట్ కాలేక సినిమాను ఒప్పుకోలేదట. దీంతో ఆమె ప్లేసులో మీనాకు అవకాశం ఇచ్చారు. కుష్బూ నటిస్తే ఎలా ఉండేదో తెలియదు గానీ.. మీనా మాత్రం తన పాత్రలో జీవించారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కుష్భూ ఆ విషయాన్ని బయటపెట్టడంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.