
India Population 2023: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది అంటే.. ఠక్కున వచ్చే జవాబు చైనా. కానీ, ఇప్పుడు ఆ సమాధానం స్థానంలో భారత్ వచ్చి చేరింది. ఇండియా జనాభా చైనాను దాటేసింది. సుమారు 50 లక్షల అత్యధిక జనాభాతో చైనాను అధిగమించింది. కొన్ని సర్వే సంస్థలు ప్రపంచ జనాభాను అంచన వేయగా, ఈ విషయం వెల్లడైంది. అత్యధిక పాపులేటెడ్ దేశాల్లో భారత్ అగ్ర స్థానంలో నిలచింది.
ప్రపంచ జనాభాను గణించేందుకు ‘‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్’’ అనే సంస్థ 2023 రిపోర్టును విడుల చేసింది. దాని ప్రకారం 2022 డిసెంబరు 31 నాటికి భారత జనాభా 141.70 కోట్లు కాగా, చైనా జనాభా 141.2 కోట్లు. ఆ లెక్కన ఇరు దేశాల మధ్య జనాభా వ్యాత్యాసం 50 లక్షలు. ఇదే విషయాన్ని మాక్రోట్రెండ్స్ అనే సంస్థ కూడా ప్రకటించింది. కాగా, మూడో స్థానంలో అమెరికా నిలిచింది. ఇక్కడి జనాభా 34 కోట్ల మంది. మొత్తమ్మీద ప్రపంచ జనాభా 804.5 కోట్లని తేల్చి చెప్పారు.
ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీయాల్సి ఉంటుంది. 2020లో కరోనా కారణంగా అధికారిక లెక్కలు వేయడం కుదరలేదు. సర్వే సంస్థలు చెబుతున్న లెక్కలపై ఆధారపడి జనాభాను గడించాల్సి వస్తోంది. 2011 తరువాత చైనాలో జనాభా పెరుగుదలలో 1.2 శాతం క్షీణిత నమోదవుతుంది. ఇండియాలో 1.7 శాతం పెరుగుదల ఉంది. ఏప్రిల్లోనే చైనాను భారత్ దాటేసింది. అయితే, అధికార లెక్కలు ఇరు దేశాల నుంచి లేకపోవడంతో తేదీని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నామని ఐక్య రాజ్య సమితి అధికారులు చెబుతున్నారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇండియా ఒకటి. ఆసియాలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉంది. ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన భారత్ చాలా అంశాల్లో నిలిచింది. తాజగా జనాభా విషయంలోను అగ్రస్థానంలో నిలివడంపై మేధావుల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలో దాదాపు 50 శాతం మంది యువత ఉన్నారు. ఆ కారణంగా 2050 నాటికి రికార్డు స్థాయిలో జనాభా పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.