
Nani Dasara Movie Villain: న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘దసరా’ మూవీ నేడు పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రీ రిలీజ్ కి ముందు నుండే విపరీతమైన హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, విడుదల తర్వాత పాజిటివ్ టాక్ రావడం తో ఓపెనింగ్స్ స్టార్ హీరో రేంజ్ లో ఉన్నాయి.
ఈ చిత్రానికి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడానికి కారణం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో పాటుగా న్యాచురల్ స్టార్ నాని అద్భుతమైన నటన. ఈ సినిమాలో నాని నటన తర్వాత హైలైట్ గా నిలిచింది విలన్ పాత్ర. ఈ పాత్రని ప్రముఖ మలయాళం హీరో షైన్ టామ్ చేసాడు. ఈయనకి శాండిల్ వుడ్ లో విలక్షణమైన నటుడిగా మంచి క్రేజ్ ఉంది. ఈయన చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి.
కేవలం హీరో పాత్రలు మాత్రమే కాకుండా, అప్పుడప్పుడు ఇలాంటి రోల్స్ కూడా చేస్తూ ఉంటాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన షైన్ టామ్ చాకో ‘గడ్డమ్మ’ అనే మలయాళీ సినిమాతో నటన కూడా ప్రారంభించాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఆయనకీ మంచి పేరు రావడం తో పలు సినిమాల్లో సపోర్టింగ్ పాత్రలు పోషించే ఛాన్స్ కూడా దక్కింది.అలా నటుడిగా ప్రారంభమైన ఇతగాడు సుమారుగా 70 సినిమాల్లో నటించాడు. అందులో పలు సినిమాల్లో హీరో గా నటించగా, ఎక్కువ సినిమాల్లో విలన్ గానే రాణించాడు.’దసరా’ సినిమా ఆయనకీ టాలీవుడ్ లో మొట్టమొదటి చిత్రం. కామం తో రగిలిపోతున్న ఒక క్రూర మృగం లాగ ఇందులో ఎంతో చక్కగా నటించాడు.

ఆయనకీ గతం లో ‘ఇష్క్’ అనే మలయాళం సినిమాలో విలన్ గా చేసినందుకు సైమా అవార్డు కూడా వచ్చింది.’దసరా’ చిత్రం కూడా ఆయనకీ ఎన్నో అవార్డ్స్ తెచ్చిపెడుతుందని విశ్లేషకులు అంటున్నారు, అంతే కాదు ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఆయనకీ మరిన్నీ ఆఫర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది.