Education: పంచితే తరగనిది ఏదైనా ఉందా అంటే అది విద్యనే. తరగడం కాదు మరింత పెరుగుతుంది కూడా. ఇలాంటి విద్య ఎవరి ఇంట్లో ఉన్న రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఆ దేశాలు రాష్ట్రాలు, ఇల్లులు అందంగా ఉంటాయి. ఆ ఇల్లు కలకలలాడుతూ విజ్ఞానంతో వెలిగిపోతుంటుంది. ఇక ఇలాంటి విద్యావంతులు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నారు అంటే.. అమెరికా, ఇంగ్లండ్ అంటూ చాలా మంది సమాధానాలు చెబుతారు. కానీ అది పూర్తిగా తప్పని తెలుస్తోంది. మరి ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారా? అయితే చదివేయండి…
యుఎస్, యూకేలను వదిలి అనేక దేశాలు విద్యలో ముందంజలో ఉన్నాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో -ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక విద్యావంతులైన దేశాల జాబితాలో కెనడా అగ్రస్థానంలో ఉంది. దీని ప్రకారం, కెనడాలో 59.96 శాతం మంది విద్యావంతులు ఉన్నారట. ఇక జపాన్ 52.68 శాతం అక్షరాస్యతతో రెండవ స్థానంలో ఉంది. ప్రముఖ దేశాలైన యూఎస్, యూకే లు 6వ, 8వ స్థానాల్లో ఉండగా, లక్సెంబర్గ్ మూడవ స్థానంలో ఉన్నాయి.
దక్షిణ కొరియా కూడా ఈ రేసులో 4వ స్థానంలో ఉంది. అంటే యూఎస్ఏ కంటే ముందు. ఉన్నత విద్యావంతులైన దేశాల జాబితాలో 5వ స్థానంలో ఇజ్రాయిల్ ఉండగా.. ఐర్లాండ్ కంటే బ్రిటన్ 8వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో, ప్రపంచంలో అత్యధిక విద్యావంతులైన దేశాల జాబితాలో భారతదేశం టాప్ 10 స్థానాల్లో కూడా లేదు. ఎందుకంటే ఇండియాలో విద్యా పరిజ్జానం చాలా తక్కువ. మన ఇండియాలో కేవలం 20.4శాతం మాత్రమే ఉన్నారట. అది కూడా ఉన్నత విద్య లేదా డిగ్రీని కలిగి ఉన్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టాటిస్టిక్స్ విద్యపై ఒక నివేదికను ప్రచురించింది. ఇండియాలోని ఏడు రాష్ట్రాల్లో విద్యా సాధన చాలా వెనుకబడి ఉందని పేర్కొంది. అయితే అత్యధిక విద్యావంతులు ఉన్న రాష్ట్రాల జాబితాలో కేరళ అగ్రస్థానంలో ఉంది. కేరళ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అగ్ర స్థానంలో నిలవడం గమనార్హం. దీని ప్రకారం మొత్తం జనాభాలో 39 శాతం మంది యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేశారట.