Earthquake: ఆ దేశాల్లోనే భూకంపాలు ఎందుకు ఎక్కువ వస్తాయో తెలుసా?

Earthquake: ప్రపంచంలో భూకంపాలు దాదాపు అన్ని దేశాల్లో వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని దేశాల్లో తరచుగా వస్తుంటాయి. జపాన్ లో ఎప్పుడు భూకంపాలు వస్తూనే ఉండటంతో అక్కడి వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంటారు. భూ ఉపరితలం మందంగా ఉన్న చోట భూకంపాలు రావు. కానీ భూమి లోపల పొరలు పలచగా ఉంటే నిరాటంకంగా వస్తాయి. సిస్మిక్ తరంగాల కదలికల వల్ల భూకంపాలు ఏర్పడతాయి. హిమాలయాల్లో ఇలాంటి తరంగాలే తరచుగా వస్తుంటాయి. మన దేశంలో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ […]

Written By: Srinivas, Updated On : February 7, 2023 3:44 pm
Follow us on

Earthquake

Earthquake: ప్రపంచంలో భూకంపాలు దాదాపు అన్ని దేశాల్లో వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని దేశాల్లో తరచుగా వస్తుంటాయి. జపాన్ లో ఎప్పుడు భూకంపాలు వస్తూనే ఉండటంతో అక్కడి వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంటారు. భూ ఉపరితలం మందంగా ఉన్న చోట భూకంపాలు రావు. కానీ భూమి లోపల పొరలు పలచగా ఉంటే నిరాటంకంగా వస్తాయి. సిస్మిక్ తరంగాల కదలికల వల్ల భూకంపాలు ఏర్పడతాయి. హిమాలయాల్లో ఇలాంటి తరంగాలే తరచుగా వస్తుంటాయి. మన దేశంలో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు భూకంపం వస్తుందనే భయం ఉండదు. ఎందుకంటే ఇక్కడ భూకంపాలు వచ్చిన దాఖలాలు లేవు.

జపాన్ లోనే ఎందుకు భూకంపాలు ఎక్కువగా వస్తాయి?

భూకంపం అనగానే గుర్తొచ్చే పేరు జపాన్. ఇక్కడ భూకంపాలు, సునామీలు సాధారణం. ఎందుకంటే ఈ దేశం సముద్రంపై తేలుతూ ఉంటుంది. దాని ఫలితంగానే భూ పలకాల్లో కదలికలు పెరిగి భూకంపాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. రిక్టర్ స్కేలుపై 4 కంటే తక్కువ నమోదైతే పెద్దగా సమస్య ఉండదు. కానీ 7 తీవ్రతతో నమోదైతే భూకంప ఫలితం ఎక్కువగా ఉన్నట్లే. అక్కడి ప్రభుత్వం సెప్టెంబర్ 1ని విపత్తు నివారణ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఇండోనేషియా సైతం..

భూకంప తీవ్రతను ఎదుర్కొంటున్న దేశాల్లో ఇండోనేషియా కూడా ఒకటి. ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ దేశం కింద ఓ పెద్ద అగ్నిపర్వతం ఉంది. దీంతో రింగ్ ఆఫ్ ది ఫైర్ అని పిలుస్తారు. ఇండోనేషియాలోని భూమి కింద పలకాల్లో కదలికలు ఉండటం వల్ల భూకంపాలు వస్తుంటాయి. ఇంకా పిలిప్పీన్స్ కూడా భూకంప బాధిత దేశమే. ఇక్కడ కూడా తరచుగా భూకంపాలు వస్తుంటాయి. అగ్ని పర్వతాలు పేలుడు వల్ల కూడా భూకంపాలు రావడం సహజమే. ప్రకృతి విధ్వంసానికి పరాకాష్ట భూకంపాలే కావడం గమనార్హం.

ఈక్వెడార్ లో కూడా..

భూకంపాలు వచ్చే దేశాల్లో దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ కూడా ఒకటి. భూమి లోపల కదలికలు వచ్చినప్పుడు సిస్మిక్ తరంగాలు బయటకు వచ్చేందుకు అగ్నిపర్వతాలు మార్గాన్ని ఎంచుకోవడంతో భూకంపాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. భూకంపాలు వచ్చే దేశాల్లో టర్కీ కూడా ఉంది. ఈ దేశం ఆఫ్రికా, యూరప్, అరేబియా మధ్యలో ఉండటంతో ఇక్కడ కూడా తరచుగా భూకంపాలు వస్తున్నాయి. ప్రపంచంలో 90 శాతం భూకంపాలు రింగ్ ఆఫ్ ది ఫైర్ లోనే జరుగుతున్నాయి. ఇది ఆస్ట్రేలియాలో మొదలై ఇండోనేషియా, పిలిప్పీన్స్, జపాన్, కాలిఫోర్నియా, దక్షిణ అమెరికా అంతటా విస్తరించి ఉండటంతో భూకంపాలు ఎక్కువగా వస్తున్నాయి.

Earthquake

జపాన్ లో సురక్షిత చర్యలు

జపాన్ దేశంలో తరచూ భూకంపాలు వస్తుండటంతో అక్కడి ప్రజలు కర్రలతో చేసిన ఇళ్లలోనే నివసిస్తారు. సిమెంట్ తో కట్టిన ఇళ్లలో ఉండేందుకు ఇష్టపడరు. ఎందుకంటే వారికి భూకంప తాకిడి ఎక్కువగా ఉండటంతో వారి రక్షణ చర్యల్లో భాగంగా కట్టెలతో ఇళ్లు తయారు చేసుకుంటారు. ఇవి భూకంపం వచ్చినా మనకు పెద్దగా నష్టం కలిగించవు. కర్రలతో గాయాలు కావు. అందుకే వారు ఇలాంటి ఇళ్లు కట్టుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు.

Tags