Balagam: ఇటీవల కాలం లో చిన్న సినిమా గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి వసూళ్లను రాబట్టిన చిత్రం ‘బలగం’.ప్రాముఖ్యక జబర్దస్త్ కమెడియన్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించి ఇతనిలో ఇంత టాలెంట్ ఉందా అని అందరూ ఆశ్చర్యపొయ్యేలా చేసాడు. చిన్నప్పటి నుండి ఆయన పుట్టి పెరిగిన ఊర్లో జరిగే సంప్రాదయాలను, సంస్కృతిని మరియు ఆ గ్రామ ప్రజల ఎమోషన్స్ ని వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించాలని అనుకున్నాడు, అనుకున్న పనిని సాధించాడు.
కమర్షియల్ గా ఈ చిత్రం వర్కౌట్ అవుతుందా లేదా అనే సంగతి పక్కన పెట్టి మంచి సినిమాని జనాలకు అందించాలని ముందుకొచ్చిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇలా టాలెంట్ ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటే ఇండస్ట్రీ లో బలగం లాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు డైరెక్టర్ వేణు.
ఆయన మాట్లాడుతూ ‘ముందుగా ఈ కథని శివ శంకర్ అనే నిర్మాతకి వినిపించాను,ఆయనకీ కథ బాగా నచ్చింది. అయితే ఈ ‘బలగం’ అనే కథ నేను హీరోగా చెయ్యడానికి రాసుకున్న కథ, కానీ శివ శంకర్ గారు అందుకు ఒప్పుకోలేదు,ఎవరైనా పాపులర్ నటులతో చేద్దాం అని అన్నారు.నా కథలో నన్ను హీరో గా పక్కన పెట్టడం ఏమిటి అని ఆయనతో సినిమా చెయ్యడానికి ఒప్పుకోలేదు.
అయితే కొన్ని రోజుల తర్వాత దిల్ రాజు గారికి ఈ కథ వినిపించాను, ఆయన మొత్తం విని ఈ కథని దర్శి తో చేద్దామని అన్నాడు.ఆయన దర్శి పేరు చెప్పగానే, నా కథకి నాకంటే కూడా నూటికి నూరుపాళ్లు న్యాయం ప్రియా దర్శినే చెయ్యగలడు అని అనిపించింది. నేను కూడా పూర్తి స్థాయిలో దర్శకత్వం వైపు ద్రుష్టి సారించినట్టు ఉంటుందని వేంటనే ఒప్పుకొని చేశాను. ఫలితం ఈరోజు మన అందరం చూస్తూ ఉన్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు వేణు.